YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక

TRINETHRAM NEWS

శ్రీ సత్యసాయి జిల్లా
ధర్మవరం నియోజకవర్గం 22-01-2024

YSR పార్టీకి 30 కుటుంబాలు రాజీనామా అనంతరం టీడీపి లొకి చెరిక

బీసీల ద్రోహి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి -మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి

శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ ముదిగుబ్బ మండల కేంద్రంలో జరిగిన “జయహో బీసీ” మడకశిర నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీ గుండుమల తిప్పేస్వామి ధర్మవరం నియోజకవర్గ ఇంచార్జ్ పరిటాల శ్రీరాం మరియు కదిరి నియోజకవర్గ ఇంచార్జి కందికుంట వెంకట ప్రసాద్ పాల్గోన్నారు. అదేవిధంగా ముదిగుబ్బ మండలంలో YSR పార్టీకి చెందిన 30 కుటుంబాలు రాజీనామ చేసి టీడీపి చేరినారు వాళ్ళను పసుపు కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతు బీసీ ల ద్రోహి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బడుగు బలహీన వర్గాలకు అండగా నిలబడింది తెలుగుదేశం పార్టీ మొట్ట మొదటిసారిగా బీసీలకు రిజర్వేషన్లు తీసుకొచ్చిన ఘనత నందమూరి తారక రామారావు గారిది అనంతరం రిజర్వేషన్లను పెంచి పదవుల్ని ఇచ్చిన ఘనత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది, అంతేకాకుండా కార్పొరేషన్ లు ఏర్పాటు చేసి కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీ రుణాలు ఇచ్చిన ఘనత తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు గారిదని కొనియాడారు అనంతరం వైయస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కార్పొరేషన్లకు ఒక్క రూపాయి నిధులు ఇవ్వకుండా కార్పొరేషన్లను నీరుగార్చిన ద్రోహి జగన్మోహన్ రెడ్డి అంటూ మండిపడ్డారు, ఇటువంటి తరుణంలో బీసీలందరూ ఏకతాటిపై ఉంటూ వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి అండగా ఉండి నారా చంద్రబాబునాయుడు గారిని ముఖ్యమంత్రి గా చేసుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది అంటూ అన్ని వర్గాల వారు తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాలని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాస్ మూర్తి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు రంగయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి అంబికా లక్ష్మీనారాయణ, జిల్లా కురుబ సాధికార కన్వీనర్ గోవిందప్ప, వివిధ జిల్లా బిసి సంఘం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top