జూన్ 26, 2026

WhatsApp Image 2024 02 08 at 14.59.05

TRINETHRAM NEWS

Trinethram News : కడప జిల్లా :ఫిబ్రవరి 08
పీసీసీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల అభ్యర్థన మేరకు రాష్ట్ర డీజీపీ ఉత్తర్వుల మేరకు ప్రస్తుతం ఉన్న వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూ రిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని జిల్లా ఎస్.పి సిద్దార్థ్ కౌశల్ తెలిపారు.

భద్రతా ప్రమాణాల నిబంధనల స్కేల్ మేరకు భద్రతా కల్పించడం జరిగిందని ఎస్.పి వివరించారు. ఎవరైనా వ్యక్తుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని, వారికి గన్ మెన్లను కేటాయించమని ఇంటెలిజెన్స్ విభాగం ఇచ్చే సిఫారసు సెక్యూరిటీ రివ్యూ కమిటీ నివేదిక మేరకు గన్ మెన్లను కేటాయించడం జరుగుతుందని జిల్లా ఎస్.పి వివరించారు.

కాగా వైయస్ షర్మిల రెండు రోజుల క్రితం తనకు భద్రత కల్పించాలని బహిరంగం గానే డిమాండ్ చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో షర్మిల రాష్ట్రవ్యాప్తంగా పీసీసీ అధ్యక్షురాలు హోదాలో పర్యటిస్తున్నారు.

దీంతో స్థానికంగా ప్రోటోకాల్ అంశాలను పరిగణలోకి తీసుకొని భద్రత ఏర్పాటు చేయడంతో పాటు వన్ ప్లస్ వన్ గన్ మెన్ సెక్యూరిటీ నుండి టూ ప్లస్ టూ గా పెంచడం జరిగిందని కడప జిల్లా ఎస్పీ తెలిపారు..

You cannot copy content of this page