20 days ago, a cart was parked on the side of the road near Sabbitham
ప్రమాదానికి గురై మంచాల పడ్డ గోదావరిఖని విఠల్ నగర్ కు చెందిన తోటి ఫొటోగ్రాఫర్ వేల్పుల ప్రదీప్ కు ఆర్థిక చేయూత
20 రోజుల క్రితం సబ్బితం దగ్గర రోడ్డు పక్కకు బండి ఆపుకొని నిలుచున్న
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
గోదావరిఖని ఫోటోగ్రాఫర్స్అసోసియేషన్ సభ్యుడైనటువంటి వేల్పుల ప్రదీప్ కు ఒక ఆగంతకుడు తాగి బండి నడుపుతూ వచ్చి వేల్పుల ప్రదీప్ కు యాక్సిడెంట్ చేయడం జరిగింది. ఇట్టి ప్రమాదంలో అతని ఎడమ కాలు ఎడమ చేయి ఫ్రాక్చర్ మరియు అతని ఎడమ కాలికి పెద్ద గాయం కాగా మంచానికి పరిమితం కావడం జరిగింది.
ఇట్టి పరిస్థితిని చూసి గోదావరిఖని ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మరియు జిల్లా ఫోటో& వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కుటుంబ భరోసా కు విన్నవించుకోగా వెంటనే స్పందించి తెలంగాణ రాష్ట్ర కుటుంబ భరోసా ఎకౌంటు నుండి పదివేల రూపాయల ఆర్థిక సహాయం బాధిత వేల్పుల ప్రదీప్ కు ప్రకటించి పంపడం జరిగింది. పదివేల రూపాయలను ₹ 10,000/- ఈరోజు అసోసియేషన్ బాధ్యులు వేల్పుల ప్రదీప్ ఇంటికి వెళ్లి అందించడం జరిగింది.
ఇట్టి కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షులు రెడ్డి , ప్రధాన కార్యదర్శి శనిగరపు మల్లేష్, కోశాధికారి బండారి ప్రసాద్, ఉపాధ్యక్షులు దుస్స మహేష్, తొగతి శ్రీధర్, సంయుక్త కార్యదర్శులు గుడెల్లి.శ్రీనివాస్, చిప్ప కుమారస్వామి. రాగుల రాము మరియు సభ్యులు పాల్గొనడం జరిగింది
ఇట్టి ఆర్థిక సహాయం చేసిన తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోశాధికారులకు బాధితుడు మరియు గోదావరిఖని ఫోటో& వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ పెద్దపల్లి జిల్లా ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కృతజ్ఞతలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App