జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 23 at 11.37.02 AM

TRINETHRAM NEWS

రైతు బంధుపై ఫిర్యాదుల వెల్లువ.రైతు అకౌంట్లో 2 రూపాయలు జమ..!!

రాష్ట్రంలో రైతు బంధు పంపిణీ పై మునుపెన్నడూ లేని విధంగా రైతుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. రూపాయి, రెండు రూపాయలు తమ అకౌంట్లో జమ అయినట్లు మెసేజ్ లు వస్తున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు.

రైతు బంధు అకౌంట్లో జమ అయిన రోజు ఓ రైతుకు 1 రూపాయి మాత్రమే జమ అయ్యింది. ఆ మెసేజ్ చూసిన రైతు ఒక్కసారిగా కంగుతిన్నాడు. ఇప్పుడు తాజాగా సూర్యపేట జిల్లా చిలుకూరు మండలం నారాయణపురం గ్రామానికి చెంది శ్రీను అనే రైతుకు కూడా ఇలాంటి అనుభవమే ఎదురైంది.

తనకు 32 గుంటల భూమి ఉందని కేసీఆర్ సర్కార్ ఉన్నప్పుడు తనకు రూ. 4వేల చొప్పున జమ అయ్యిందని..ఈసారి రూ. 2 రూపాయలు జమైనట్లు మెసేజ్ వచ్చిందని సదరు రైతు ఆందోళన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి తన అకౌంట్లో పూర్తిస్థాయిలో రైతుబంధ నగదు జమ అయ్యే విధంగా చూడాలని కోరాడు. వాస్తవానికి అందాల్సిన పెట్టుబడి సాయం కంటే చాలా తక్కువ మొత్తంలో రైతుల అకౌంట్లో జమ అవుతున్నవిషయాన్ని ఇప్పటికే మీడియా రిపోర్ట్ చేసినప్పటికీ సర్కార్ కానీ, అధికారులు కానీ దీనిపై స్పందించలేదు.

You cannot copy content of this page