TRINETHRAM NEWS

19500 as per JVO No. 60 as minimum wage paid to NHM Health Woman DEOs

హైదరాబాద్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేస్తున్న మహిళ డాటా ఎంట్రీ ఆపరేటర్స్ (డీ.ఈ.ఓ) సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని 60 జి.ఓ. ప్రకారం 19500/- ఇవ్వాలి.ఈ సందర్బగా ఏఐటియుసి రాష్ట్ర ఉప ప్రధాన కార్యదర్శి మరియు ఎన్ హెచ్ ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం. నర్సింహా మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రభుత్వం వెంటనే నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంతోపాటు డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఆయన ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు నేషనల్ హెల్త్ మిషన్ లో పనిచేయుచున్న కాంట్రాక్టు డీ.ఈ.ఓ. కనీస వేతనాలు అమలు చేయకుండా శ్రమ దోపిడీకి గురి చేయుచున్నారని ఏఐటీయూసీ అనుబంధం ఎన్ హెచ్ ఎం కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ఎంప్లాయిస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా విమర్శించారు.

ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం లో సరిపడా నిధులు ఉన్నప్పటికీ అంగట్లో అన్ని ఉన్నా అల్లుని నోట్లో సేని అన్నట్లు కార్మికుల జీతాలు పెంచేందుకు మాత్రం అధికారులు చర్యలు తీసుకోవడం లేదని గత రెండు సంవత్సరాల నుంచి డీ.ఈ.ఓ.అతి తక్కువ జీతాలతో కేవలం 15000/- రూపాయలు చెల్లిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన ఔట్సోర్సింగ్ జీవో 60 ప్రకారం డీ.ఈ.ఓ లకు రూపాయలు 19500/- రావలసి ఉన్న అధికారులు పట్టించుకోక వారు శ్రమ దోపిడీకి గురవుతున్నారని వారు తెలియజేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారులు ఈ సమస్యలపై తగు చర్యలు తీసుకుని కార్మికులకు న్యాయం చేయనితో భవిష్యత్తులో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వారు వివరించారు కనీస వేతనం , వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేయడం జరిగింది.. ఇట్టి ఈ కార్యక్రమంలో టి. సౌమ్యత్రి, బి శ్రావణి , జి స్వప్న , సి.హెచ్. భవాని, ఎం.అనిత, ఎన్. కళ్యాణి తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

19500 as per JVO No. 60 as minimum wage paid to NHM Health Woman DEOs