
కూకట్పల్లి త్రినేత్రం న్యూస్ మార్చి 22 : కూకట్పల్లి నియోజక వర్గం కూకట్పల్లి డివిజన్ లో నివాసం ఉంటున్న జి.రామారావు సన్ ఆఫ్ లక్ష్మయ్య. వయస్సు 51 సంవత్సరాలు, లివర్ సమస్యతో నిమ్స్ హాస్పిటల్ లో చేరడం జరిగింది. వారి కుమారుడు మిథిల్ కూకట్పల్లి లోని గొట్టిముక్కల వెంకటేశ్వరరావు కార్యాలయం లో సంప్రదించగా వారికి కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ ద్వారా ముఖ్యమంత్రి సహాయ నిది కి అప్లై చేయడం జరిగింది. వారికి 1,50,000 రూపాయల ఎల్ ఓ సి మంజూరు అయ్యింది..
ఆ ఎల్ ఓ సి లెటర్ ను కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ మరియు కూకట్పల్లి నియోజక వర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టుముక్కల వెంకటేశ్వర రావు చేతుల మీదుగా రామారావు భార్య అంజమ్మ మరియు వారి కుమారుడు మిథిల్ కు అందజేయడం జరిగింది.ఈ సందర్భంగా అంజమ్మ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి, బండి రమేష్, గొట్టుముక్కల వెంకటేశ్వరరావు కి కృతజ్ఞతలు తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
