WhatsApp Image 2024 08 19 at 12.50.13
15 quintal ration of rice Pattiveta District Civil Supplies Department Officer Prem Kumar
ముత్తారం, ఆగస్టు -19: త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ముత్తారం మండల కేంద్రంలో అక్రమంగా నిల్వ చేసిన 15 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టుకున్నామని జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ తెలిపారు.
ఆదివారం అర్థరాత్రి సమయంలో జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మండల కేంద్రంలో ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ముత్తారం మండల కేంద్రంలో గంట భీమయ్య అనే వ్యక్తి వద్ద అక్రమంగా ఉన్న 15 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని తనిఖీల్లో పట్టుకోవడం జరిగిందని అన్నారు.
గంట భీమయ్య పై తెలంగాణ రాష్ట్ర ప్రజా పంపిణీ వ్యవస్థ నియంత్రణ ఉత్తర్వులు 2016 ప్రకారం పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరిగిందన్నారు.
ఈ తనిఖీలలో ఎన్ఫోర్స్మెంట్ సంబంధిత అధికారులు, తదితరులు జిల్లా పౌర సరఫరాల అధికారి వెంట ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
