CPM : 1/70 చట్టం జీవో నెంబర్ 3 రక్షణకై పోరాడే సిపిఎం పార్టీపై విమర్శించే అర్హత మట్టడం. రాజబాబు కి లేదు. కె. రామారావు

TRINETHRAM NEWS

అల్లూరి జిల్లా అరకులోయ త్రినేత్రం న్యూస్ మార్చి 10: నకిలీ గిరిజన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ఏజెంట్ జేఎసి రాష్ట్ర వైస్ చైర్మన్ మేట్టడం రాజబాబు సిపిఎం పార్టీ పై విమర్శించడాన్నీ సిపిఎం పార్టీ తీవ్రంగా ఖండిస్తూన్నది,1/70 చట్టం జివో నంబర్ 3 రక్షణకై పోరాడే సిపిఎం పార్టీ పై విమర్శించే అర్హత మట్టడం రాజబాబుకు లేదు
సిపిఎం కమ్యునిస్టు పార్టీలు జేఏసీ ఉద్యమానికి ముక్క చెక్కలు చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు సిపిఎం ఖండిస్తూన్నది గత నెల ఆదివాసీ జేఎసి ప్రజాసంఘాల 1/70 చట్ట పరిరక్షణ బంద్ విజయవంతం చెయ్యాలని ఐక్య పోరాటానికి అగ్రభాగాన పాల్గొన్న సిపిఎం పార్టీ ని విమర్శించడన్నీ తీవ్రంగా ఖండిస్తున్నాది,భారత ఆదివాసీ పార్టీ అరకు ఎంపి అభ్యర్థిగా మట్టడం రాజబాబు సిపిఎం పార్టీ మద్దతు ఇవ్వలేదని కోపమా నకిలీ గిరిజన బీజేపీ ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత ను సిపిఎం వొడించి నందుకు కోపమా? మట్టడం రాజబాబు వైఖరి ఏమిటో చెప్పాలి,ఆదివాసీల హక్కుల రక్షణకై పోరాడే సిపిఎం,కమ్యునిస్టు పార్టీ పై విమర్శిస్తు, ఆదివాసీల రక్షణ చట్టలైన 1/70 చట్టం జివో నంబర్ 3 ధ్వంసం చేస్తున్న బీజేపీ,టీడీపీ పార్టీలకు ఏజెంట్ గా పనిచేస్తున్నా మాట్టడం రాజాబాబుకు విమర్శించే నైతిక విలువలు లేదని సిపిఎం పార్టీ అరకు వేలి మండల కార్య దర్శి కె.రామారావు తీవ్రంగా విమర్శించారు.
గత నెల ఆదివాసీల ప్రజా సంగాల1/70 పరిరక్షణ మాన్యం బంద్ కు మొట్టమొదటగా సిపిఎం పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు గారు మద్దతు తెలిపారని ఏజన్సీ 11 మండలంతో బాటు ఆంధ్ర మాన్యం ప్రాంతం అంతా సిపిఎం పార్టీ అగ్రభాగాన ఆదివాసీల బంద్ పోరాటంలో సంపూర్ణంగా పాల్గొని విజయవంతనికి కృషి చేసిందని సిపిఎం కమ్యునిస్టు పార్టీలకు జేఏసీ పోరాటానికి విచ్ఛిన్నం చేస్తుందని తప్పుడు ఆరోపణలను తీవ్రంగా ఖండీంచారు. మొదటి రోజు 11 తేదిన బంద్ కు రాజబాబు ఎందుకు మద్దతు నివ్వలేదని రాజబాబు ఆదివాసీ పోరాటాలను ముక్కలు చెక్కలు చేస్తున్నారని అది మరిసి సిపిఎం పార్టీ పై బురద జల్లుతున్నారని రామారావు తీవ్రంగా విమర్శించారు.
మట్టడం రాజబాబు భారతీయ ఆదివాసీ పార్టీ ఏమ్,పీ అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు సిపిఎం పార్టీ మద్దతు ఇవ్వమని ఎందుకు అడిగారని ప్రశ్నించారు.
గత పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి కొత్త పల్లి గీత నకిలీ గిరిజన సర్టిఫికెట్ తో ఎంపి నామినేషన్ పత్రాలపై.విచారణ జరిగినప్పుడు కొత్త పల్లి గీత నకిలీ గిరిజన సర్టిఫికెట్ రద్దు చేయాలని సిపిఎం పార్టీ ఎంపి అభ్యర్థి పీ.అప్పల నర్సయ్య ఎన్నికల రిటర్నింగ్ అధికారికి పిర్యాదు చేసి నప్పుడు అక్కడే ఉన్న భారత ఆదివాసీ పార్టీ అప్పటి ఎంపి అభ్యర్థి మట్టడం రాజబాబు ఎందుకు పిర్యాదు చెయ్యకుండా ఉన్నారని అప్పుడు ఎంత డబ్బులు తీసు కున్నారని ప్రశ్నించారు.
జివో నంబర్ చట్టబద్ధత కోసం పోరాడే సంగలపై తప్పుడు ఆరోపణలు చేయడాన్ని తీవ్రంగా ప్రశ్నించారు.
ఏజెన్సీ ప్రాంతంలో జివో నంబర్ 3 చట్టబద్ధత ఏజెన్సీ స్పెషల్ డీఎస్సీ నోటిఫికేషన్ 1/70 చట్టం రక్షణకు నిరంతరం పోరాడే సిపిఎం పార్టీ పై విమర్శలు మాని ఆదివాసీ చట్టాలు ఉల్లంఘిస్తున్న బీజేపీ,టీడీపీ పార్టీలపై పోరాటం చెయ్యాలని హితవు పలికారు.
కమ్యునిస్టు.నాయకులు భూ కబ్జాలు చేస్తున్నారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని ఏ కమ్యునిస్టు పార్టీ నాయకుడు భూ.ఆక్రమణ చేశారో నిరూపిస్తే ప్రజలకు పంపిణీకి సిద్ధంగా ఉన్నామని సవాల్ చేశారు.
ఈ కార్య క్రమాలో సిపిఎం మండల నాయకులు కె.జగన్నాధం,కె.మగ్గాన్న కె.సహదేవ్ టీ.హరి పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

CPM party

You cannot copy content of this page

Scroll to Top