YSRCP Leaders Mourn : కాపు నేత తోట సత్యనారాయణ మరణంపై వైఎస్ఆర్‌సీపీ నాయకుల సంతాపం
త్రినేత్రం న్యూస్, కాపు నేత, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తుల అన్న తోట సత్యనారాయణ ఇటీవల స్వర్గస్తులైన సందర్భంగా పలువురు వైఎస్ఆర్‌సీపీ నాయకులు వారి నివాసానికి చేరుకుని చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమంలో యువజన విభాగం రీజినల్ కోఆర్డినేటర్ జక్కంపూడి గణేష్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి జేసీఎస్ ఇన్‌చార్జ్ తడాల విష్ణు చక్రవర్తి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కాపు కార్పొరేషన్ మాజీ డైరెక్టర్, యువ కాపునాడు రాష్ట్ర అధ్యక్షులు ముద్దాల తిరుపతిరావు, వైఎస్ఆర్‌సీపీ వికలాంగుల సెల్ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షులు ముత్యాల పోసి కుమార్, కాపు నేత ఎంపీటీసీ సాపిరెడ్డి కామేష్, కార్మిక నేత చిలుకూరి రామకృష్ణ, కాపు నేత ఆరేటి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు.
తోట కుటుంబ సభ్యులను పరామర్శించిన నాయకులు, వారి కుటుంబానికి ఈ దుఃఖాన్ని తట్టుకునే ధైర్యాన్ని ప్రసాదించాలని భగవంతుడిని ప్రార్థించరు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe

