సెప్టెంబర్ 25, 2026
TRINETHRAM NEWS
resolving grievances

Resolving Grievances : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబరు 25 ; నూజివీడు నియోజకవర్గం, మండలంలో డైనమిక్ శాసనసభ్యులు, రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌరసంబంధాల మంత్రి కొలుసు పార్థసారథి తన క్యాంప్ కార్యాలయంలో ప్రజాధర్బార్ నిర్వహించారు. ఆ నియోజకవర్గం నలుమూలలు నుండి వచ్చిన ప్రజలు యొక్క అర్జీలను స్వీకరించారు. ప్రజాదర్బార్‌లో ప్రధానంగా పింఛన్లు, రేషను కార్డులు, గృహనిర్మాణాలు, రోడ్లులు, డ్రైనేజీ వ్యవస్థ, తాగునీటి సరఫరా, రెవెన్యూ సంబంధిత సమస్యలు, వ్యక్తిగత సమస్యలు మొత్తం 26 అర్జీలను స్వీకరించారు.ప్రతి ఒక్కరి సమస్యలను శ్రద్ధగా విన్నారు.

తక్షణమే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి కొన్ని సమస్యలు వెంటనే పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాసమస్యలు సత్వర పరిష్కారమే ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని, ప్రజలు ఇచ్చిన అర్జీలుపై అధికారులు నిర్లక్ష్యం వహించ కుండా నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను నేరుగా తెలుసు కునేందుకే ప్రజాధర్బార్ నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.

భారత ప్రభుత్వ పరిపాలన విధానాలు మరియు ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థల (Grievance Redressal) గురించి పూర్తి సమాచారం కోసం ఈ ‘ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్’ బెస్ట్ బుక్స్‌ను అమెజాన్ నుండి ఇక్కడ ఆర్డర్ చేయండి.

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page