YouTuber Brutally Murdered : యూట్యూబర్ దారుణ హత్య.. ఇంట్లో కత్తి పోట్లతో

TRINETHRAM NEWS

Trinethram News : భారత సంతతికి చెందిన ఓ యూట్యూబర్ కెనడాలో దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని వ్యక్తి ఆమెను ఇంట్లోనే అతి కిరాతకంగా కత్తితో పొడిచాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా యూట్యూబర్ ప్రాణాలు కోల్పోయింది.

ఈ సంఘటన మంగళవారం చోటుచేసుకుంది. లాసల్లే పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పంజాబ్ మూలాలు కలిగిన నాన్సీ గ్రేవాల్ కెనడాలోని ఒంటారియోలో నివసిస్తోంది. నాన్సీ సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. పంజాబ్‌‌కు సంబంధించిన విషయాలపై ఎప్పటికప్పుడు తన అభిప్రాయాలను వీడియోల రూపంలో తెలియజేస్తూ ఉంటుంది.

చాలా సందర్భాల్లో ఖలిస్థానీల తీరును తప్పుబట్టటంతో పాటు కెనడా, ఇండియాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల గురించి కూడా మాట్లాడింది. సోషల్ మీడియాలో ఎంతో యాక్టీవ్‌‌గా ఉండే నాన్సీపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. విచక్షణా రహితంగా పలుమార్లు ఆమెను పొడిచాడు. అనంతరం అక్కడినుంచి పారిపోయాడు. రాత్రి 9 గంటల ప్రాంతంలో ఈ దారుణం జరిగింది. స్థానికులు ఈ సంఘటనపై లాసల్లే పోలీసులు, పారామెడిక్స్‌కు సమాచారం ఇచ్చారు.

విండ్సర్-ఎసెక్స్ ఎమర్జెన్సీ మెడికల్ సర్వీసెస్ సిబ్బంది రక్తపు మడుగులో పడి ఉన్న నాన్సీని ఆస్పత్రికి తరలించారు. నాన్సీని పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు ధ్రువీకరించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

బుధవారం ఉదయం నాన్సీ ఉంటున్న ఏరియాలోని రెండు ఇళ్లలో సోదాలు నిర్వహించారు. కాంక్రీట్ రహదారితో పాటు నాన్సీ నివసిస్తున్న ఇంటిలోకి వెళ్లే మెట్లపై పలు ఆధారాలను సేకరించారు. ఈ కేసుకు సంబంధించి ఎలాంటి సమాచారం తెలిసినా వెంటనే డిటెక్టివ్ జామీ నెస్టర్‌కు ఫోన్ చేయాలని పోలీస్ ఉన్నతాధికారులు ప్రజలను కోరారు..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

YouTuber brutally murdered

You cannot copy content of this page

Scroll to Top