నిరంతర అభివృద్ధితోనే నియోజకవర్గం సర్వతోముఖాభివృద్ధి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్
Trinethram News : Medchal : ఈరోజు నిజాంపేట్ కార్పొరేషన్ పరిధిలోని పలు డివిజన్లలో 2.05 కోట్ల రూపాయల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు, భూగర్భ డ్రైనేజీ పనులకు కుత్బుల్లాపూర్ అభివృద్ధి ప్రదాత, హ్యాట్రిక్ ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ… గత పదేళ్ల టిఆర్ఎస్ పాలనలో కోట్లాది రూపాయల నిధులతో నిజాంపేట్ కార్పొరేషన్ తో పాటు కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలను సర్వతోముఖాభివృద్ధి పరిచామని, రానున్న రోజుల్లో కూడా మరిన్ని నిధులు వెచ్చించి నిజాంపేట్ కార్పొరేషన్ ను మరింత అభివృద్ధి పరుస్తామని అన్నారు.
శంకుస్థాపన కార్యక్రమ వివరాలు….
మూడవ డివిజన్ లోని ఇన్కాయిస్ నుంచి సంతృప్తి హోటల్ వరకు సుమారు 65 లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ పనులు
22వ డివిజన్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నుంచి ఎలీప్ చౌరస్తా వరకు దాదాపు 55 లక్షల రూపాయలతో భూగర్భ డ్రైనేజీ పైప్లైన్ పనులు…
24వ డివిజన్లో గుడ్ మార్నింగ్ కేఫ్ నుంచి ఇన్కాయిస్ సర్కిల్ వరకు (38.00 లక్షలు), అదేవిధంగా ప్రగతి నగర్ లోని ప్యూర్ ఓ నాచురల్ నుంచి శ్రీ సాయి కృష్ణ అపార్ట్మెంట్ వరకు (17.00 లక్షలు) చేపట్టనున్న సీసీ రోడ్డు పనులకు….
25వ డివిజన్ లోని ఆర్ఆర్ ఎంక్లేవ్ నుంచి శ్రీ గురు రాఘవేంద్ర కిరాణా స్టోర్ వరకు 30 లక్షల రూపాయలతో చేపట్టనున్న సిసి రోడ్డు పనులు…
ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, ఎన్ఎంసి బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రంగరాయ ప్రసాద్, కార్పొరేటర్లు ఎం.సుజాత, బాలాజీ నాయక్, పైడి మాధవి, లక్ష్మి కుమారి, రాఘవేంద్ర రావు, గాజుల సుజాత, రవి కిరణ్, కో-ఆప్షన్ సభ్యలు చంద్రగిరి జ్యోతి సతీష్, నాయకులు మంజునాథ్, సాంబశివా రెడ్డి, శ్రీకర్ గుప్త, ప్రవీణ్, కుమార్ రెడ్డి, అజయ్ చౌదరీ, దూసకంటి వెంకటేష్, ఖాన్ సాబ్, నబీ, ఎండి. సలీం, స్వామి, దశరథ్, బిక్షపత్తి, ముత్యాలు, బైండ్ల నగేష్,యాదగిరి గౌడ్, జశ్వంత్, జలగం చంద్రయ్య, నాగ శ్రీనివాస్ యూత్ ప్రవీణ్, మెహబూబ్, మహిళా అధ్యక్షురాలు అర్ఫిత ప్రకాష్, స్వర్ణ కుమారి, కృష్ణ మంజరి, శిల్ప తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App