MLA Satyananda Rao : గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తా

TRINETHRAM NEWS

వాడపాలెం గ్రామంలో వాటర్ ట్యాంక్ మరియు వేస్ట్ మేనేజ్మెంట్ ప్రాజెక్ట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే సత్యానందరావు, ఎంపీ హరీష్…

వాడపాలెం: త్రినేత్రం న్యూస్. కొత్తపేట మండలం వాడపాలెం గ్రామంలో పలు అభివృద్ధి పనులను స్థానిక ఎమ్మెల్యే బండారు సత్యానందరావు,పార్లమెంట్ సభ్యులు గంటి హరీశ్ మాధూర్ లు ప్రారంభించారు.గ్రామ ప్రజలకు త్రాగు నీటి సరఫరా కోసం ఇంటింటికీ త్రాగునీటి పథకం ద్వారా 89.80 లక్షల నిధులతో నూతనంగా నిర్మించిన వాటర్ ట్యాంకును ప్రారంభించారు.అలాగే 15 లక్షల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించిన ఘన ద్రవ్య వ్యర్థ పదార్థముల నిర్వహణ కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యానందరావు మాట్లాడుతూ గ్రామాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తానని తెలిపారు.కొన్ని అభివృద్ధి పనులు నిర్మాణం పూర్తి కానున్నాయని త్వరలోనే వాటిని ప్రారంభించి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.అభివృద్ధి కోసం అడిగిన వెంటనే నిధులు మంజూరు చేసిన ఎంపీ హరీష్ ధన్యవాదాలు తెలియజేశారు.

ఎంపీ హరీష్ మాట్లాడుతూ గ్రామ అభివృద్ధికి ఎమ్మెల్యే సత్యానందరావు కోరిక మేరకే నిధులు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉన్నానని అభివృద్ధి కోసం కృషి చేయడంలో ఎమ్మెల్యేకు తోడుగా ఉంటానని చెప్పారు.అనంతరం ఎమ్మెల్యే సత్యానందరావు,ఎంపీ హరీష్ లకు గ్రామస్తులు పూలమాలలు,దుశ్శాలువాలతో సత్కరించారు.అలాగే ఉత్తమ సర్పంచ్ గా ఎన్నికై ఢిల్లీలో అవార్డు అందుకున్న గ్రామ సర్పంచ్ త్సామా ఆదినారాయణ మూర్తి (బాబు) ను ఎమ్మెల్యే,ఎంపీ చేతుల మీదుగా సన్మానించారు.ఈ కార్యక్రమం లో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Will develop the village

You cannot copy content of this page

Scroll to Top