TRINETHRAM NEWS

హమాలీల కూలీ రేట్లు పెంచకుండా నిర్లక్ష్యం వహిస్తున్న హోల్ సేల్ వ్యాపారులు.

పత్రికా ప్రకటన,
తేది 27-01-2025.

కూలీ రేట్లు పెంచకుంటె మార్కెట్ ను స్తంబింపజేస్తాం.

ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మడ్డి ఎల్లా గౌడ్.

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో పని చేస్తున్న హమాలీ కార్మికుల కు కూలీ రేట్లు పెంచకుండా హోల్ సేల్ వ్యాపారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, సరైన విధానం కాదని, వెంటనే వారికి కూలీ రేట్లు పెంచాలని లేకుంటే కూరగాయల మార్కెట్ ను స్తంబింపజేస్తామని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మడ్డి ఎల్లా గౌడ్ హెచ్చరించారు. సోమవారం ఆయన గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో పర్యటించి హమాలీ వర్కర్స్ తో మాట్లాడి వారి సమస్యల ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత నలబై ఏళ్ళ కు పైగా గోదావరిఖని కూరగాయల మార్కెట్ లో హమాలీ వర్కర్స్ పని చేస్తున్నారని, హమాలీ కార్మికులకు 2017 లో పెంచిన కూలీ రేట్లు, ఇంత వరకు పెంచకుండా హోల్ సేల్ వ్యాపారులు హమాలీలను ఇబ్బందులకు గురి చేయడం సరైంది కాదని ఆయన అన్నారు. హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కూలీ రేట్లు పెంచాలని గత సంవత్సరం వినతి పత్రం హోల్ సేల్ వ్యాపారులకు ఇచ్చినా హమాలీ వర్కర్స్ యూనియన్ నాయకులతో సమావేశం ఏర్పాటు చేయకుండా, చర్చలు జరుపకుండ నాయకులను, హమాలీలను రైతులను ముందట పెట్టి దొంగలు గా చిత్రీకరించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.

మార్కెట్లో హోల్ సేల్ వ్యాపారులు చేస్తున్న వ్యాపారం గురించి, రైతుల వద్ద వారు ఎలా వ్యవహరస్తున్నారో తమకు తెలుసని, కాని వ్యవహారం విషయం లో ఒక పద్దతి అనేది ఉంటుందని దాన్ని విస్మరించి హోల్ సేల్ వ్యాపారులు హమాలీ కూలీ రేట్లు పెంచమంటె పెంచకుండా ఇక్కడ కూలీ రేట్లు ఇతర ప్రాంతాల్లోని మార్కేట్ ల కన్నా ఎక్కువ ఇస్తున్నామని ప్లెక్సీ బ్యానర్ లు వేసి మార్కెట్ లో ప్రదర్శించడం దుర్మార్గమైన చర్య అని ఆయన మండిపడ్డారు. గోదావరిఖని కూరగాయల మార్కెట్ తో ఇతర మార్కెట్ లో ఉన్న కూలీ రేట్లు పోల్చవద్దని, ఎక్కడి మార్కెట్ కు కక్కడె సౌకర్యం బట్టి కూలీ రేట్లు ఉంటాయని, అది గమనించకుండా కూలీ రేట్లు పెంచేది లేదని మొండికేయడం సరైంది కాదని ఆయన హోల్ సేల్ వ్యాపారులకు సూచించారు. ఇట్టి విషయం లో కరీంనగర్ జిల్లా లేబర్ కమీషనర్ దగ్గర కు హోల్ సేల్ వ్యాపారులు వెళ్లి మేం మాట్లాడుకొని సమస్య పరిష్కారం చేస్తామని కమీషనర్ కు చెప్పి రేట్లు పెంచకుండా మోసం చేశారని ఆయన ఆరోపించారు.

గత ఐదేళ్లుగా చాలిచాలని కూలీ రేట్ల తో హమాలీలు తమ కుటుంబాలను ఇబ్బందులతో పోషించుకుంటున్నారని ఆయన అన్నారు. ఇప్పటికైనా హోల్ సేల్ వ్యాపారులు భేషజాలకు పోకుండా హమాలీలకు న్యాయంగా దక్కాల్సిన కూలీ రేట్లు పెంచాలని ఆయన డిమాండ్ చేశారు, లేనిచో ఏఐటియుసి ఆధ్వర్యంలో మార్కెట్ ను స్తంబింపజేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంకా ఈ సమావేశంలో ఏఐటియుసి నగర వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు గోదావరిఖని కూరగాయల మార్కెట్ హమాలీ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు ఎం.ఎ.గౌస్, నాయకులు కండె లక్ష్మయ్య, రాంచందర్, జానిమియా, గాలి పెల్లి సతీష్ తదితరులు పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App