TRINETHRAM NEWS

ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్ : సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ?

-విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ప్రజాలపై అధిక భారం మోపుతారా?

_*-కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించిన పాడేరు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్య రాస విశ్వేశ్వర రాజు.

•వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన, మీడియా సమావేశంలో శాసన సభ్యులు అల్లూరి జిల్లా అధ్యక్షులు,
మత్స్యరాస విశ్వేశ్వర రాజు, మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు సూపర్ సిక్స్ హామీలు పేరు చెప్పి రాష్ట్ర ప్రజలకు మభ్యపెట్టి అనేక రకాల పార్టీలతో పొత్తుల పెట్టుకుని, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా సూపర్ సిక్స్ హామీల్లో ఒక్క హామీ కూడా ప్రజలకు అందించడంలో విఫలం చెందారు.
_అదే సూపర్ సిక్స్ హామీల్లో ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని, ఊరు వాడ గడప,గడపకు వెళ్లి నోటికి వచ్చినట్లు చెప్పినా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఇప్పుడేమో రాష్ట్ర ప్రజలపై విద్యుత్ ఛార్జీల అధిక భారం మోపుతున్నారు.

రాష్ట్రం మొత్తం కరెంట్ బిల్లులు మోత మొదలైంది! రాష్ట్రం అభివృద్ధి సంక్షేమం పట్ల శ్రద్ధ చూపడం లేదు, హింస పాలన కొనసాగిస్తున్నారు, చంద్రబాబు నాయుడు నలభై ఏళ్లు రాజకీయం అనుభవం అంటున్నారు. ప్రజలు బాగోగులు మీకు పట్టవా! చేతనైతే మీరు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు మీద దృష్టి పెట్టండి. అంతేకాని రైతులు మీద అధిక భారం మోపి వసూలు చెయ్యకండి, అని అన్నారు.

ఈ మీడియా సమావేశంలో
శాసన మండలి సభ్యులు కుంభ రవిబాబు,
ఉమ్మడి విశాఖ జిల్లాల జెడ్పీ ఛైర్పర్సన్
జల్లిపల్లి సుభద్ర,
అరకు శాసన సభ్యులు
రేగం మత్య లింగం,
మాజీ శాసన సభ్యురాలు
కొట్టగుళ్లి భాగ్య లక్ష్మి,
మండల పార్టీ అధ్యక్షులు ఎస్ రాంబాబు, వైస్ ఎంపీపీ కె. కనకాలమ్మ, మండలంలో వివిధ పంచాయితీల ఎంపీటీసీలు, సర్పంచులు, పార్టీ వివిధ పదవుల్లో ఉన్న నాయకులు సీనియర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App