
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. డిండి మండలం నిజాం నగర్ ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు స్వపరిపాలన దినోత్సవ కార్యక్రమాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు ఉపాధ్యాయులు అమరేందర్ రవిలు ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థులు ఉపాధ్యాయులుగా మారి తరగతులు నిర్వహించి పాటలు బోధించారు విద్యార్థులు ఉపాధ్యాయులు గానే కాక వివిధ హోదాల్లో నిర్వహించారు.
కలెక్టర్ గా అక్షయ, డీఈవోగా చందన, ఎమ్మెల్యేగా రిషి, ఎమ్మార్వో గా ప్రియదర్శిని, ఎంఈఓ గా మేఘన, డాక్టర్ గా హిమాశ్రీ, ప్రధానోపాధ్యాయునిగా యశ్వంత్, మిగతా విద్యార్థులు ఉపాధ్యాయులుగా (టీచర్లు గా) విధులు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు మరియు గ్రామ పెద్దలు పాల్గొని ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
