TRINETHRAM NEWS

ప్రజల సొమ్మును సీఎం సహాయనిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు.. మీ ఉద్దేశం ఏమిటి?

Trinethram News : Andhra Pradesh : మూడేళ్ల కిందట రామతీర్థం ఆలయంలో రాముడి విగ్రహం తలనరికేసిన కేసులో నిందితుడిగా ఉన్న వ్యక్తికి సాక్షాత్తూ అదే ఆలయానికి ధర్మకర్తగా ఉన్న కేంద్ర మాజీ మంత్రి అశోక్‌ గజపతిరాజు చేతుల మీదుగా సీఎం సహాయ నిధి నుంచి రూ.5 లక్షలు ఇచ్చారు.

ఆ కార్యక్రమంలో జిల్లా మంత్రితో పాటు, స్థానిక ఎమ్మెల్యే, ఇతర ప్రజాప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఆరోజు అతడిపై రాజకీయ ఉద్దేశంతో కేసు పెట్టినట్టు మీరు భావించి ఉంటే, మీ ప్రభుత్వం విచారణ జరిపించి దాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాల్సింది.

తప్పుడు కేసు పెట్టారని నిర్ధారించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలి. అలా కాకుండా, ఒకవేళ అతడు నిందితుడే కాదని మీరు చెప్పదల్చుకుంటే.. కూటమి ప్రభుత్వం అసలు నిందితుడిని పట్టుకుని చట్టం ముందు నిలబెట్టాలి. అదేమీ లేకుండా ప్రజల సొమ్మును సీఎం సహాయనిధి నుంచి నిందితుడికి ఇచ్చి ఏం సందేశం ఇస్తున్నారు. నిందితుడికి డబ్బులివ్వడం వెనుక మీ ఉద్దేశం ఏమిటి?

-బొత్స సత్యనారాయణ, శాసన మండలి విపక్ష నేత

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App