WhatsApp Image 2024 11 01 at 19.08.42
వరంగల్ డి.ఎం.అండ్.హెచ్.ఓ డాక్టర్.బి.సాంబశివరావుకి శుభాకాంక్షలు తెలిపిన జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా
వరంగల్ జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వైద్య అధికారిగా ఇటీవల నూతన బాధ్యతలు చేపట్టిన డాక్టర్ .బి సాంబశివరావును (ఏఐటియుసి అనుబంధం) జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా ఆధ్వర్యంలో శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిసి పూల గుచ్చం అందజేశారు. ఎన్ హెచ్ ఎం ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని ఆయన దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం
డి.ఎం.అండ్.హెచ్.ఓ డాక్టర్ సాంబశివరావు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలు తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తానని అన్నారు. జాతీయ ఆరోగ్య మిషన్ కార్యక్రమాలు విజయవంతం చేయాలని ఉద్యోగులకు సూచించారు .ఈ కార్యక్రమంలో యూనియన్ వరంగల్ జిల్లా నాయకులు ఏకుల చిరంజీవి, హనుమకొండ జిల్లా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ ఓశపాక సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
