
డిండి (గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చాలి ఫిబ్రవరి 7న లక్ష డప్పులు వేల గొంతుకలు మహాప్రదర్శనను జయప్రదం చేయాలి–జంతుక రేణయ్య.
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పై సుప్రీంకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలి. జంతుక రేణయ్య మాదిగ ఆధ్వర్యంలో డిండి మండల కేంద్రంలో అంబేద్కర్ బాబు జగ్జీవన్ విగ్రహాల వద్ద గోడ పత్రికలు ఆవిష్కరణ చేయడం జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డిండి మండల అధ్యక్షులు జంతుకరేణయ్య మాదిగ హాజరై మాట్లాడుతూ గౌరవ పద్మశ్రీ అవార్డు గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 7న హైదరాబాద్లో జరగబోయే లక్ష డప్పులు వేల గొంతుకలు ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా కనివిని ఎరుగని రీతిలో హైదరాబాద్ నగరంలో జరిగే మహా సంస్కృతిక ప్రదర్శనను జయప్రదం చేయాలని, డిండి మండల ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో మండల నాయకులు ఎదుర్ల విజయకుమార్, బుసిపాక బాలయ్య, బుసిపాక సాలయ్య, చింతపల్లి వెంకటయ్య బుష్పాక వెంకటేష్ గుడాటి వెంకటయ్య సాయిబాబా ఆర్కపల్లి అజయ్ నల్ల శంకర్ బుసిపాక పర్వతాలు నరేందర్ ఆరెకంటి శ్రీను తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
