
Vinayaka Chavithi : దేవరకొండ డివిజన్ సెప్టెంబర్ 09, త్రినేత్రం న్యూస్. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని దేవరకొండ పట్టణంలో ని ఎంపీడీవో కార్యాలయంలో శాంతి సమావేశం సబ్ కలెక్టర్ కరోలిన్ బుధవారం అధ్యక్షతన నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ పార్టీల నాయకులు సంఘాల నాయకులు మండప నిర్వాహకులు హాజరయ్యారు సబ్ కలెక్టర్ కరోలిన్ మాట్లాడుతూ… ప్రశాంతమైన వాతావరణంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అన్ని మతాలను గౌరవిస్తూ వినాయక చవితిని జరుపుకోవాలని సూచించారు. వివిధ డిపార్ట్మెంట్ లకు సంబంధించిన అధికారులతో ఏర్పాట్ల పర్యవేక్షణ ను అడిగి తెలుసుకున్నారు. ముఖ్యంగా పీస్ కమిటీ లో రాజకీయ నాయకులు మాట్లాడుతూ.. నిమజ్జనం వద్ద విద్యుత్తు లైట్లను ఏర్పాటు చేయాలని తెలిపారు.
రోడ్లకు ఇరువైపులా లైట్లను అమర్చాలని, రోడ్ల వెంట వేలాడే విద్యుత్ వైర్లను తొలగించాలని రోడ్లకు ఇరువైపులా మట్టిని పోయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ డిఎస్పి శ్రీనివాసరావు, సీఐ వెంకటరెడ్డి, తహసిల్దార్ సంజయ్ కుమార్ ,వివిధ శాఖల అధికారులు వివిధ పార్టీల నాయకులు మండప నిర్వహకులు తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe