అక్టోబర్ 28, 2026
TRINETHRAM NEWS
MLA Distributes Cheques

MLA Distributes Cheques : ఏలూరు జిల్లా : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 16 ; ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అటవీ శాఖ ఆధ్వర్యంలో వన సంరక్షణ సమితుల షేరింగ్ అమౌంట్‌లో భాగంగా చెక్కుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోలవరం డైనమిక్ శాసనసభ్యులు చిర్రి బాలరాజు పాల్గొన్నారు. సంబంధిత వన సంరక్షణ సమితుల అధ్యక్షులకు చెక్కులను అందజేశారు. ఆయన తొలుత ములగలంపల్లి గ్రామ జనసేన అధ్యక్షులు సొంటి రామకృష్ణ నివాసానికి చేరుకున్నారు. అక్కడ ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా అల్పాహారం స్వీకరించారు.

అనంతరం స్థానికులు, నాయకులు పూలవర్షంతో ఘనంగా ఆత్మీయ స్వాగతం పలికారు. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలోని కనకాపురం, జిల్లెల్లగూడెం, బుట్టాయిగూడెం మండలంలోని వెలుతురువారిగూడెం వన సంరక్షణ సమితుల అధ్యక్షులకు షేరింగ్ అమౌంట్‌కు సంబంధించిన చెక్కులను అందజేశారు.
ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ, అటవీ ప్రాంతాల్లో పర్యావరణ పరిరక్షణతో పాటు అడవుల సంరక్షణలో వన సంరక్షణ సమితులు కీలక పాత్ర పోషిస్తున్నాయని అన్నారు. అడవులను కాపాడుతూ, పచ్చదనాన్ని పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం అందిస్తున్న సహకారాన్ని సద్వినియోగం చేసుకుని అటవీ సంరక్షణకు మరింత కృషి చేయాలని సూచించారు. కనకాపురం ఎంపీయూపీ పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఎమ్మెల్యే మొక్కలు నాటారు.

పర్యావరణ పరిరక్షణ, మొక్కల సంరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించి, భవిష్యత్ తరాలకు పచ్చని వాతావరణాన్ని అందించాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని పేర్కొన్నారు.జిల్లా అడివిశాఖ అధికారి పి. సందీప్ రెడ్డి, సబ్ డివిజనల్ ఫారెస్ట్ ఆఫీసర్ వెంకట సుబ్బయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుర్గా కుమార్, ఎమ్మార్వో వెంకటేశ్వరరావు, ఇతర అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు, ఏఎంసీ చైర్మన్ పొట్ట రామారావు పాల్గొన్నారు.
అలాగే కూటమి నాయకులు ఉండవల్లి సోమసుందరం, బండారు అనిల్ కుమార్, సుంకవల్లి సాయి, నాలి శ్రీనివాస్, రూపా సత్యనారాయణ, కొప్పుల శ్రీకాంత్, సొంటి రామకృష్ణ, పద్దం వెంకటకృష్ణ, కుంజా రమేష్, వీరంకి వెంకటేశ్వరరావు, గంటసాల అచ్యుతరామారావు, చిర్రి నాగరాజు, సిరిబత్తుల స్వామి, మందపాటి సూర్య, రాయి సుబ్బారావు, వనమా రాంబాబు, గణేష్ తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page