TRINETHRAM NEWS

మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ నివాళులు అర్పించిన వికారాబాద్ కాంగ్రెస్ నాయకులు
వికారాబాద్ నియోజకవర్గం త్రినేత్రం ప్రతినిధి
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆదేశాల మేరకు వికారాబాద్ MLA క్యాంపు కార్యాలయం(ప్రజా భవన్ )లొ వికారాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అర్థ. సుధాకర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని,ఆర్థిక సంస్కర్త, పద్మ విభూషణ్, రాజకీయ దురంధరుడు డాక్టర్.మన్మోహన్ సింగ్ అకాల మరణానికి చింతిస్తూ పట్టణ కాంగ్రెస్ నాయకులు ఘనంగా వారికి నివాళులర్పించారు ఈ సందర్భంగా వారు చిత్రపటానికి పూలమాలలతో శ్రద్ధాంజలి ఘటించారు కాంగ్రెస్ పార్టీకి డాక్టర్ మన్మోహన్ సింగ్ మరణం తీరని లోటు అని భారత ఆర్థిక వ్యవస్థను మెరుగుపరచడంలో మన్మోహన్ సింగ్ ది చాలా ముఖ్యమైన పాత్ర అని మాజీ ప్రధాని పీవీ నరసింహారావు హయాంలో ఆర్థిక మంత్రిగా పనిచేసిన డా “మన్మోహన్ సింగ్ ఎనలేని మన్ననలు పొందారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు… ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మాజీ మున్సిపల్ చైర్మన్ V. సత్యనారాయణ, డీసీసీబీ డైరెక్టర్ నా. కిషన్ నాయక్ మరియు కౌన్సిలర్లు, వార్డు ఇన్చార్జిలు, నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు*

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App