Vijayasai Reddy Met PM Modi: ప్రధాని మోడీతో విజయసాయిరెడ్డి భేటీ.. ఏపీకి సంబంధించిన అంశాలపై చర్చ..
న్యూఢిల్లీ:ప్రధాని నరేంద్రమోడీతో వైఎస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయిరెడ్డి పార్లమెంట్‌లోని ప్రధానమంత్రి కార్యాలయంలో సోమవారం మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు..
ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన అనేక అంశాలపై ప్రధానితో సుదీర్ఘంగా చర్చించారు. ప్రధానమంత్రిని కలుసుకోవడం గౌరవంగా విశేషంగా భావిస్తున్నానని ఈమేరకు భేటీ అనంతరం విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫలవంతమైన సహకారం ఆశిస్తున్నామని అన్నారు. కేంద్రం- రాష్ట్రంలో వేగంగా మారుతోన్న రాజకీయ పరిణామాల మధ్య.. వైఎస్ఆర్సీపీ పార్లమెంటరీ పార్టీ అధినేత వీ విజయసాయి రెడ్డి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలుసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించినందుకు అభినందించారు..
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించామని విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా తెలిపారు. పార్లమెంట్‌లోని ప్రధాని కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించానని.. ఎప్పటిలాగే, ప్రధానమంత్రిని కలవడం ఒక గౌరవం.. విశేషం అంటూ విజయసాయి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ సమగ్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమం కోసం కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఫలవంతమైన సహకారం కోసం ఎదురు చూస్తున్నామంటూ విజయసాయిరెడ్డి ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఈ భేటీలో ప్రత్యేక హోదా, ఆర్థిక సహకారం, కేంద్రప్రభుత్వ పథకాల అమలు తదితర అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో ఏపీ ఎన్నికలు, సార్వత్రిక ఎన్నికలు జరగనున్న తరుణంలో వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ప్రధానితో భేటీ అవ్వడం చర్చనీయాంశంగా మారింది..
అంతకుముందు విజయసాయి రెడ్డి రాజమండ్రి విమనాశ్రయంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయడంపై ప్రధాని మోడీ ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు. . రాజమండ్రి విమానాశ్రయంలో రూ.350 కోట్లతో నిర్మిస్తున్న కొత్త టెర్మినల్ భవనం.. గోదావరి ప్రాంతానికి ఒక వరం.. ప్రస్తుతం ఉన్న భవనం కంటే 400 రెట్లు ఎక్కువ.. 10 రెట్ల ప్రయాణికులకు మేలు జరగుతుందన్నారు..