అక్టోబర్ 7, 2026
TRINETHRAM NEWS
VDS Free Training Centers

VDS Free Training Centers : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 02, త్రినేత్రం న్యూస్. జాతిపిత మహాత్మా గాంధీ ఆశయ సాధనే లక్ష్యంగా.. గ్రామీణ యువత మరియు మహిళలు స్వయం ఉపాధి దిశగా అడుగులు వేసేందుకు దేవరకొండ పట్టణంలో ‘విలేజ్ డెవలప్ సొసైటీ’ ( వీ డి ఎస్) మరో కీలక ముందడుగు వేసింది. గాంధీ జయంతిని పురస్కరించుకుని వీ డి ఎస్ ఆధ్వర్యంలో ఉచిత వృత్తి విద్యా శిక్షణా కేంద్రాల మూడో విడత బ్యాచ్‌లను ఘనంగా ప్రారంభించారు. దీనిలో భాగంగా టైలరింగ్, కంప్యూటర్ మరియు బ్యూటీషియన్ కోర్సుల కొత్త బ్యాచ్‌లు అధికారికంగా ప్రారంభమయ్యాయి.
​ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రిటైర్డ్ హెల్త్ సీహెచ్‌ఓ ఆర్. గోపాల్ సింగ్, రిటైర్డ్ కండక్టర్ ధరం సింగ్, మరియు ఆర్టీఐ ఆక్టివిస్ట్ సొసైటీ రాష్ట్ర అధ్యక్షులు డా,,కొర్ర కిషన్ నాయక్ విచ్చేశారు. వారు జ్యోతి ప్రజ్వలన చేసి శిక్షణా కేంద్రాలను ప్రారంభించారు.
​ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. నేటి ఆధునిక కాలంలో నిరుద్యోగ యువత, మహిళలు చేతివృత్తులు మరియు సాంకేతిక నైపుణ్యాలు నేర్చుకోవడం ద్వారా ఆర్థికంగా ఎదగడానికి ఇలాంటి కేంద్రాలు ఎంతో దోహదపడతాయని అన్నారు.

​ఈ కార్యక్రమంలో వీ డి ఎస్ కోఆర్డినేటర్ భాషా చౌహాన్, నాయకులు టీక్య నాయక్, గోవర్ధన్, ఎన్. శాంతి, కే. కవిత, బి. నిహారిక తదితరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page