అక్టోబర్ 23, 2026
TRINETHRAM NEWS
Gandhi Jayanti and Shastri Jayanti

Gandhi Jayanti and Shastri Jayanti : డిండి (గుండ్లపల్లి) అక్టోబర్ 02, త్రినేత్రం న్యూస్. కొరివి కృష్ణయ్య స్పోర్ట్స్ క్లబ్ ఆధ్వర్యంలో జాతిపిత మహాత్మా గాంధీ జయంతి మరియు మాజీ ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కొరివి కృష్ణయ్య స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు బాధమోని శ్రీనివాస్ గౌడ్ ముఖ్య అతిథిగా హాజరై, మహాత్మా గాంధీ మరియు లాల్ బహదూర్ శాస్త్రి చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఈ సందర్భంగా అధ్యక్షులు మాట్లాడుతూ సత్యం, అహింస, దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం వంటి మహనీయుల ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆచరించాలని, ముఖ్యంగా యువత క్రీడలతో పాటు సామాజిక బాధ్యత, ఐక్యత, దేశభక్తి భావాలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బొల్లె సైలేష్ , గడ్డమీది సాయి, శ్రీనివాసులు,తండు చంద్రయ్య ,శ్రీరామదాసు మధు, ముమ్మడి సురేష్ ,ఏలకుర్తి మల్లేష్,చింతపల్లి నరేష్ ,గుర్రం సురేష్,కొట్ర మధు ,సుంకరిచంద్రయ్య,సుంకరి బాలస్వామి ,ఒగ్గు అనిల్,జవ్వాద్ తది తరులు పాల్గొన్నారు.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page