
-సమస్యల పరిష్కారం, హక్కుల పరిరక్షణకు ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్.
Nationwide Protest : దేవరకొండ డివిజన్ అక్టోబర్ 02, త్రినేత్రం న్యూస్. జర్నలిస్టుల సమస్యల పరిష్కారం హక్కుల పరిరక్షణ పెండింగ్ డిమాండ్ల సాధన కోసం దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న”డిమాండ్స్ డే”కార్యక్రమంలో భాగంగా దేవరకొండలో జర్నలిస్టులు పాల్గొని సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా మహాత్మా గాంధీ విగ్రహం వద్ద జర్నలిస్టులు సమిష్టిగా నిలబడి తమ డిమాండ్ల సాధనకు మద్దతు ప్రకటించారు. జర్నలిస్టుల సంక్షేమం ఉద్యోగ భద్రత ఇళ్ల స్థలాలు తదితర సమస్యల పరిష్కారానికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు.
ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి మధ్య వారధిగా పనిచేస్తున్న జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలపై పాలకులు సానుకూలంగా స్పందించి పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో దేవరకొండ ప్రాంతానికి చెందిన పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe