TRINETHRAM NEWS

మందిపాల్ గ్రామంలో వడ్డే ఓబన్న జయంతిని ఘనంగాజరుపుకున్న వడ్డెర సంఘం

చౌడాపూర్ మండలం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
చౌడాపూర్ మండలం మందీపాల్ గ్రామంలో వడ్డే ఓబన్న జయంతి నీ మండల వడ్డెర సంఘంనాయకులు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో చౌడపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎల్పటి అశోక్ కుమార్ మాట్లాడుతూ వడ్డే ఓబన్న జనవరి 11న రేనాటి ప్రాంతంలో జన్మించారు. ఓబన్న సంచార జాతి వడ్డెర కులానికి చెందిన వారు. బ్రిటీష్ ఈస్ట్ ఇండియా కంపెనీ ఆధీనంలో ఉన్న సమయంలో, రేనాటి.పాలేగాళ్లకు మరియు కుంఫనీకంపెనీకి తవర్జీఅధికారాన్ని కుంఫనీకి ఇచ్చినందుకు పాలెగాళ్లకు ఇచ్చే భత్యం.విషయంలో ప్రారంభమైన ఘర్షణలు, క్రమేపీ సాయుధ పోరాటం చేశ్యారు అని అన్నారు.ఆ పోరాటాల్లో ముఖ్యమైనది, నొస్సం పాలెగాడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన సాయుధ పోరు.

ఈ భీకర పోరులో, సైన్యాధ్యక్షుడిగా వడ్డే ఓబన్న పోషించిన వీరోచిత పాత్రను, చరిత్రలో తక్కువ చేయడం,అత్యంత దురదృష్టకరం. భయం ఎరుగని వడ్డెర్లు, బోయలు మరియు చెంచులతో కూడిన సంచార తెగల సైన్యాన్ని, సమర్ధవంతంగా నడిపించి, దట్టమైన నల్లమల అడవుల్లో సైతం, కుంఫనీ సైన్యాన్ని ఊచకోత కోసి ఉరుకులు పెట్టించడంలో వడ్డే ఓబన్న ముఖ్య పాత్ర పోషించిన వీరుడు మన వడ్డే ఓబన్న అని అన్నారు నరసింహా రెడ్డికి ముఖ్య అనుచరుడిగా, తన నాయకుడిని మరియు అతని కుటుంబాన్ని కూడా కాపాడటంలో, ముఖ్య పాత్ర పోషించిన వ్యక్తి వడ్డే ఓబన్న అని అన్నారు వడ్డే ఓబన్న జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నడపాలని కోరారు ఈ కార్యక్రమంలో మందిపాల్ గ్రామ పెద్దలు పోకటం శివ శంకర్. వడ్డే బాల్రాజ్. బుచ్చయ్య. కాజా పాల్గొన్నారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App