
తేదీ : 15/04/2025. యన్ టి ఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, జిల్లా కేంద్రమైన విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తెలంగాణ మరియు ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ఉత్తమ జర్నలిస్టులకు ఈనెల 12వ తారీకునాడు బహుమతులు మరియు, ప్రశంస పత్రము, అమౌంట్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఏడాది తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఉగాది పురస్కారాలను పలు విభాగాలలో ప్రతిభ కనబరిచిన వారికి అవార్డుల ప్రధాన చేయడం జరుగుతుంది.
ఈ భాగంలోనే 2024-2025వ సంవత్సరానికి గాను ఈ అవార్డుల జాబితాను టీజేఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు. రంగనాయకులు తాజాగా ప్రకటించారు. రెండు తెలుగు రాష్ట్రాలలో వందమందికి బహుమతుల అందజేయగా వారిలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ కు చెందిన జర్నలిస్టు ,సామాజిక కార్యకర్త రాపోలు లింగస్వామిని, మననీయ కోణాన్ని ఆవిష్కరించిన జర్నలిస్టుగా ఎంపిక ఇవ్వడం జరిగింది.
కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వచ్చినటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (మాజీ) నూతలపాటి .వెంకటరమణ చేతుల మీదగా అందుకోవడం జరిగింది. అతని సేవలను గుర్తు చేస్తూ అభినందనలు తెలియజేశారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం త్రినేత్రం న్యూస్ స్టేట్ బ్యూరో డైనమిక్ ప్రొఫెషనల్ సినీ గాయకులు, జర్నలిస్టు, లీడర్ వై. రామేశ్వరరావు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
