TTD laddu dispute should be investigated by sitting judge.. VHP demand
Trinethram News : మల్కాజిగిరి
టీటీడీ లడ్డూ వివాదంపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలంటూ విశ్వహిందూ పరిషత్ డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో భాగంగా సోమవారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. మల్కాజ్ గిరి చౌరస్తాలో చేపట్టిన కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ ప్రాంత ఉపాధ్యక్షురాలు భేరి సునీత, చిన్నజీయర్ స్వామి శిష్యులు శ్రీమాన్ సౌమిత్రి వేణు గోపాలాచార్యులు పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ ప్రతినిధులు మాట్లాడుతూ, తిరుమల తిరుపతి లడ్డూ వివాదంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని,తితిదే లడ్డూ తయారీలో జరిగిన తప్పులపై రోజువారి విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలి అని,దేవాలయాలలో తిష్ఠవేసిన అన్యమత ఉద్యోగులను వెంటనే తొలగించి, అన్యాక్రాంతమైన దేవాలయాల భూములను తిరిగి స్వాధీనం చేసుకొవాలి అని అన్నారు.
హిందూ దేవాలయాలపై ప్రభుత్వ పెత్తనం తొలగించాలి అని దేవాదాయ ధర్మాదాయ శాఖను రద్దు చేసి పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు, ధార్మిక సామాజిక పెద్దల నేతృత్వంలో ధార్మిక పరిషత్ ఏర్పాటు చేసి దేవాలయాల నిర్వాహణ భక్తులకు అప్పగించి దేవాలయాలలో ఉపయోగిస్తున్న పూజ ప్రసాద సామాగ్రిపై తెలంగాణ ప్రభుత్వం ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించి దేవాలయాల పరిసరాలలోని వాణిజ్య సముదాయాలలో హిందువులు మాత్రమే ఉండాలి అని విశ్వహిందూ పరిషత్ సభ్యులు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మల్కాజ్ గిరి జిల్లా విహెచ్పి అధ్యక్షులు రామనరసింహులు, జిల్లా కార్యదర్శి రజినీకాంత్,మాతృ శక్తి కన్వీనర్ పష్యంతి, జిల్లా సహకార్యదరులు దుర్గా ప్రసాద్, రాజిరెడ్డి, గోపాల్ చారి పరిషత్ సభ్యులు మానిమాల, శివానంద్,పురుషోత్తం, మల్కాజ్ గిరి కార్పొరేటర్ శ్రవణ్, స్థానిక బీజేపీ నాయకులు బాలచందర్ గౌడ్, ఉడుత నవీన్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App