
రోడ్ల దుస్థితి పై గిరిజనుల విన్నూత్న నిరసన
గిర్లిగుడ నుండి పరశీల వరకు తారు రోడ్డు -చేయాలని పాదయాత్ర
అరకు లోయ: జనవరి16: త్రినేత్రం న్యూస్ స్టాఫ్ రిపోర్టర్..
సిపిఎం పార్టీ మండల కార్యదర్శి కిండంగి రామారావు మాట్లాడుతు సంక్రాంతి కళ్ళ గుంతలు లేని రోడ్లు వేస్తామన్న కూటమి ప్రభుత్వాన్ని నిలదీసరు. హామీల అమలులో ప్రభుత్వా విఫలయత్నం వలన గిరిజనులు,విన్నూత్న నిరసనలు చేస్తున్నారాన్నరు.విషయానికొస్తే అరకు వెళ్లి మండలం బస్కి పంచాయితీ గిర్లిగూడ నుండీ , డుంబ్రిగుడ,మండలం కితలంగి పంచాయితీ పరిశీల, గ్రామం వరకూ సుమారు నాలుగున్నర కిలోమీటర్,రోడ్డు సమస్య తీవ్రంగా ఉంది.అందువలన అత్యవసర వైద్యం నిమిత్తం ఆస్పత్రిలో చేరాలంటే,అంబులెన్స్ రావడం లేదు వైద్యం సకాలంలో పొంద లేకపోతున్నారు.
ఈ రోడ్డు సౌకర్యం కల్పించినట్లయితే జిల్లా కేంద్రమైన పాడేరు చేరుకోవడానికి, అనంతగిరి మండలానికి చెందిన ప్రజలకు అరకువేలి మండలానికి చెందిన ప్రజలకు రవాణా కష్టం తీరుతుంది. పాదయాత్ర ,చేస్తున్న గిరిజనులు, రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని బౌంసుగుడ,గిర్లిగూడ, గొందిగుడ, గ్రామస్తులు పంచాయతీ యువతీ యువకులు,గిర్లిగూడ నుండి డుంబ్రిగుడ మండలం కితలంగి పంచాయతీ పరిశీల వరకు,సుమారు నాలుగున్నర కిలోమీటర్ పాటు,పాదయాత్ర చేసి రోడ్డు సమస్య పరిష్కారం చేయాలని నినాదాలు చేశారు. ప్రభుత్వం సంబంధిత అధికారులు,ప్రజాప్రతినిధులు,సత్వరమే స్పందించి సమస్య పరిష్కారం చేయాలని,విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కార్యక్రమలో దేవరపల్లి పీసా కార్యదర్శి పొత్తి, మరియూ క్రిష్ణ , బలరాం, గోవర్ధన్,బాలరాజు, వంతల హరి, డొంబర్ దర్,రఘునాథ్,భగవాన్ ( వార్డు మెంబర్) ప్రసాదరావు, రాజు ,స్వాబి జానీ బాబు, కిల్లో హరి, కిలో ఉప్ప, కిలో భాను, భాగ్య, ఫుల్ మూత్తి, మల్లిక, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
