Transformer Theft Case : కోర్టు వాయిదాలకు గైర్హాజరు ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసు నిందితుడు అరెస్ట్

TRINETHRAM NEWS
Transformer theft case accused arrested

Transformer Theft Case : త్రినేత్రం న్యూస్ మంచిర్యాల ప్రతినిధి.. మంచిర్యాల జిల్లా కోర్టులో కొనసాగుతున్న ట్రాన్స్‌ఫార్మర్ దొంగతనం కేసులో నిందితుడైన గోగు బాలకృష్ణ (నివాసం తంగళ్లపల్లి, కిస్టంపేట) కోర్టు వాయిదాలకు హాజరు కాకుండా తప్పించుకుని తిరుగుతున్నాడు.ఈ నేపథ్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు.

అనంతరం,ఈ రోజు ఆయనను మంచిర్యాల జిల్లా న్యాయమూర్తి ఎదుట హాజరుపరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితుడిని లక్షెట్టిపేట్ జైలుకు తరలించినట్లు తాండూరు ఎస్‌ఐ ప్రసాద్ తెలిపారు.
ఈ సందర్భంగా ప్రజలు చట్టాలను గౌరవించి, కోర్టు వాయిదాలకు తప్పకుండా హాజరు కావాలని సూచించారు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news

You cannot copy content of this page

Scroll to Top