Trinethram News : ప్రధాని మోదీ(narendra modi ) మంగళ, బుధవారాల్లో కేరళ, తమిళనాడు, మహారాష్ట్ర రాష్ట్రాల్లో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయా రాష్ట్రాల్లో రూ.24,000 కోట్ల విలువైన వివిధ పథకాలకు ఆయన ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు..
ప్రధాన మంత్రి 16వ విడత కిసాన్ సమ్మాన్ నిధిని కూడా విడుదల చేస్తారు. 21,000 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలకు బదిలీ చేస్తారు.
ఈ నేపథ్యంలో మొదట కేరళ(Kerala)లోని తిరువనంతపురం(thiruvananthapuram)లోని విక్రమ్ సారాభాయ్ అంతరిక్ష కేంద్రాన్ని ఈరోజు ఉదయం 10.45 గంటలకు ప్రధాని మోదీ సందర్శించనున్నారు. దాదాపు రూ. 1,800 కోట్ల విలువైన మూడు కీలకమైన అంతరిక్ష మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు ప్రధాని ప్రారంభించనున్నారు. దేశ అంతరిక్ష రంగం సామర్థ్యాన్ని పెంపొందించడంతోపాటు సాంకేతిక, పరిశోధన, అభివృద్ధికి ఈ ప్రాజెక్టులు ప్రోత్సాహకరంగా ఉంటాయి.
ఆ తర్వాత తమిళనాడు(tamilnadu)లోని మధురైలో MSME పారిశ్రామికవేత్తల కోసం ఫ్యూచర్ ఆటోమోటివ్ డిజిటల్ మొబిలిటీ ప్రోగ్రామ్ కార్యక్రమంలో మోదీ పాల్గొంటారు. నెక్ట్స్ మహారాష్ట్ర(maharashtra)లోని 5.5 లక్షల మహిళా స్వయం సహాయక బృందాలకు (SHG) రూ. 825 కోట్లు అందించనున్న ప్రధాని రివాల్వింగ్ ఫండ్ పంపిణీ చేస్తారు. దీంతోపాటు మహారాష్ట్రలో కోటి ఆయుష్మాన్ కార్డులను పంపిణీ చేయనున్నారు. OBC కేటగిరీ లబ్ధిదారుల కోసం మోదీ ఆవాస్ యోజనను ప్రారంభిస్తారు. ప్రధానమంత్రి ఇక్కడ 1300 కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన అనేక రైల్వే ప్రాజెక్టులను కూడా ప్రారంభిస్తారు..