చరిత్రలో ఈరోజు జూలై /21
Trinethram News : సంఘటనలు
1983: ప్రపంచంలోనే అతి తక్కువ ఉష్ణోగ్రత వోస్తోక్ స్టేషను, అంటార్క్‌టికా ఖండంలో (-89.2 డిగ్రీల సెంటిగ్రేడ్ -128.6 డిగ్రీల ఫారెన్ హీట్) రికార్డ్ అయ్యింది.
1984: తూర్పు జర్మనీకి చెందిన ‘మారిటా కోచ్’ 200 మీటర్లను 21.71 సెకండ్లలో సాధించి మహిళల ప్రపంచ రికార్డును నెలకొల్పింది.
1988: ఏరియేన్ -3 రాకెట్ ద్వారా 2 కమ్యూనికేషన్ ఉపగ్రహాలను పంపారు. అందులో ఒకటి భారత దేశానికి చెందినది.
1990: తూర్పు బెర్లిన్లో బెర్లిన్ గోడని తీసివేసినందుకు ఆనందంగా రాక్ కన్సర్ట్, 1,50,000 మంది ఒక పండుగలా జరుపుకున్నారు.
2005: లండన్లో బాంబు పేలుళ్ళు. అంతకు ముందు జూలై 7 న కూడా బాంబు పేలుళ్ళు జరిగాయి.
2007: జె.కె. రౌలింగ్ రాసిన హారీ పాటర్ వరుస నవలలో చివరిదైన హారీ పాటర్ అండ్ ది డెత్లో హాలోస్ విడుదలైంది.
జననాలు
1899: ఎర్నెస్ట్ హెమింగ్వే, అమెరికన్ నవలా రచయిత. నోబెల్ బహుమతి గ్రహీత.
1923: పోణంగి శ్రీరామ అప్పారావు, నాటకకర్త, అధ్యాపకుడు, నాట్యశాస్త్రం అనువాదకుడు, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత. (మ.2005)
1936: జె.బాపురెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి, కవి, రచయిత (మ. 2023)
1940: శంకర్ సిన్హ్ వాఘేలా, గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి.
1947: చేతన్ చౌహాన్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు.
1961: అమర్ సింగ్ చంకీలా, పంజాబీ గాయకుడు, గేయ రచయిత, సంగీత వాద్యకారుడు, సంగీత దర్శకుడు.(మ.1988)
1966: అనురాధ (నటి), తెలుగు నృత్యతార, సుమారు 35 చిత్రాలలో నటించింది.
1969: పసునూరు శ్రీధర్ బాబు, పాత్రికేయుడు, కవి.
1989: వరుణ్ సందేశ్, తెలుగు సినీనటుడు.
🪸1989: మధుశాలిని, తెలుగు, తమిళ నటి, వ్యాఖ్యాత, మోడల్.
మరణాలు
1796: రాబర్ట్ బర్న్స్, స్కాటిష్ కవి.
1948: అర్షిలె గోర్కీ, అబ్‌స్ట్రాక్ట్ ఎక్ష్‌ప్రెషనిస్ట్, 43వ ఏట.
1957: బెర్నార్డ్ స్పూనర్, అమెరికాలో బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ను వ్యక్తి.
1990: సౌమనశ్య రామ్మోహనరావు, రంగస్థల నటుడు, ఆకాశవాణి కళాకారుడు. (జ.1921)
1998: అలాన్ షెపార్డ్, అమెరికాకు చెందిన మొదటి రోదసీ యాత్రికుడు. అపొలో-14 రోదసీ నౌకను నడిపి చంద్రుడిని చేరి, చంద్రుడి మీద నడిచిన 5వ మనిషి.
2001: శివాజీ గణేశన్, ప్రసిద్ధ దక్షిణ భారత చలన చిత్ర నటుడు (జ.1928)
2009: గంగూబాయ్ హంగళ్, హిందుస్తాని గాయని, పద్మభూషణ్, పద్మవిభూషణ్ గ్రహీత.
2013: గిడుగు రాజేశ్వరరావు, తెలుగు భాషపై పట్టున్న రచయిత, కళాకారుడు. (జ.1932)
2023:చిత్తరంజన్, లలిత గీతాలు రచయిత, సంగీత దర్శకుడు, ఆకాశవాణిలో స్వరకల్పన.(జ.1938)
పండుగలు , జాతీయ దినాలు
1831 : బెల్జియం జాతీయ దినోత్సవము.
జాతీయ జంక్ ఫుడ్ డే.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


