ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2023 12 25 at 8.49.25 AM

TRINETHRAM NEWS

చరిత్రలో ఈరోజు డిసెంబర్ 25

సంఘటనలు

1927 : మహారాష్ట్రలోని రాయ్‌ఘర్ జిల్లాలోని మహాద్ ప్రాంతంలో అంబేద్కర్, అతని అనుచరులు 1927 డిసెంబరు 25న అంటరానితనాన్ని వ్యతిరేకిస్తూ మనుస్మృతి ప్రతిని తగలబెట్టారు.

2000: రూ.60వేల కోట్ల అంచనా వ్యయంతో రూపొందించిన గ్రామీణ రహదారుల పథకం, అంత్యోదయ అన్న పథకాలను అప్పటి ప్రధాని వాజ్‌పేయి ప్రారంభించారు.

2007: గుజరాత్ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడి మూడవసారి ప్రమాణస్వీకారం.

జననాలు

1861: మదన్ మోహన్ మాలవ్యా, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)

1901: తుమ్మల సీతారామమూర్తి, ఆధునిక పద్య కవుల్లో అగ్రగణ్యుడు. అభినవ తిక్కన బిరుదాంకితుడు/[మ.1990]

1910: కల్లూరి తులశమ్మ, సంఘసేవకురాలు, ఖాదీ ఉద్యమ నాయకురాలు. (మ.2001)

1919 : భారత సినిమా సంగీతకారుడు. బాలీవుడ్ కు చెందిన సంగీతకారుడు నౌషాద్ జననం (మ.2006).

1924: అటల్ బిహారీ వాజపేయి, పూర్వ భారత ప్రధానమంత్రి.

1917: ఊటుకూరి లక్ష్మీకాంతమ్మ, కవయిత్రి, పరిశోధకురాలు, గృహలక్ష్మి స్వర్ణకంకణ గ్రహీత (మ.1996)

1927: రాం నారాయణ్, హిందుస్థానీ శాస్త్రీయ సంగీత కళాకారుడు.

1933: పటేల్ అనంతయ్య, ఉర్దూ అకాడెమీ “తెలుగు – ఉర్దూ నిఘంటువు” ప్రాజెక్టుకు డైరెక్టర్‌గా వ్యవహరించాడు. ఆకాశవాణిలో బాలగేయాలు, జాతీయ కవితానువాదాలు ప్రసారం చేశాడు.

1936: ఇస్మాయిల్ మర్చెంట్, భారతదేశంలో జన్మించిన సినీ నిర్మాత, సుదీర్ఘ కాలంలో మర్చెంట్ ఐవరీ ప్రొడక్షన్స్‌తో అనుబంధం కలిగి ఉన్న వ్యక్తిగా బాగా సుపరిచితుడు.

1950: ఆనం వివేకానందరెడ్డి, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన రాజకీయనాయకుడు. (మ.2018)

1956: ఎన్.రాజేశ్వర్ రెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన రాజకీయ నాయకుడు, మాజీ ఎమ్మేల్యే. (మ.2011)

1876: భారత్‌ను విభజించి పాకిస్తాన్ ను ఏర్పాటుచేసిన నాయకుడు ముహమ్మద్ అలీ జిన్నా (మ.1948).

మరణాలు

1846: స్వాతి తిరునాళ్, కేరళలోని తిరువంకూరు మహారాజు, గొప్ప భక్తుడు, రచయిత. (జ.1813)

1970: దాడి గోవిందరాజులు నాయుడు, తెలుగు, ఇంగ్లీష్, హిందీ నాటకాలలో స్త్రీ పురుష పాత్రధారి. (జ.1909)

1972: చక్రవర్తి రాజగోపాలాచారి, భారతదేశపు చివరి గవర్నర్ జనరల్. (జ.1878)

1972: కాకాని వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మంత్రి.

1977 : విషాదం నేపథ్యంలో నవ్వులు పండించిన హాస్యనటుడు చార్లీచాప్లిన్‌ మరణం (జ.1889).

1996: హరిత కౌర్ డియోల్, భారత ఎయిర్ ఫోర్సుకు చెందిన మొట్టమొదటి మహిళా పైలట్. (జ.1972)

1997: జోస్యం జనార్దనశాస్త్రి, అభినవ వేమన బిరుదాంకితుడు, అష్టావధాని (జ.1911)

1998: పెనుమర్తి విశ్వనాథశాస్త్రి, తెలుగు వచన కవితా ప్రవీణులు.

2009: అజిత్ నాథ్ రే, భారతదేశ సుప్రీంకోర్టు పద్నాల్గవ ప్రధాన న్యాయమూర్తి. (జ. 1912)

2011: ఇలపావులూరి పాండురంగారావు, హిందీ సంస్కృత రచనలను తెలుగులోనికి, తెలుగు నుండి హిందీ, ఇంగ్లీషు భాషలకు అనేక పుస్తకాలను అనుసృజించాడు. (జ.1930)

2015: మెట్ల సత్యనారాయణ రావు, రాజకీయనాయకుడు. తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షుడు. (జ.1942)

2022: తమ్మారెడ్డి చలపతిరావు, సినిమా నటుడు (జ.1944)

పండుగలు, జాతీయ దినాలు

ఏసు క్రీస్తు పుట్టిన రోజు. దీనిని క్రిస్ట్‌మస్ గా క్రైస్తవులు జరుపుకుంటారు.

భారతదేశంలో సుపరిపాలన దినోత్సవం (2014)

భారత ప్రభుత్వం భారత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి జన్మదినమైన డిసెంబరు 25ను సుపరిపాలనా దినం(Good Governance Day)గా నిశ్చయించింది]

You cannot copy content of this page