WhatsApp Image 2024 09 05 at 19.46.08
Today at Zilla Parishad High School in Choppadandi town
చొప్పదండి : త్రి నేత్రం న్యూస్
విద్యను బోధించే 14 మందిప్రభుత్వ ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ చొప్పదండి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా క్లబ్ అధ్యక్షులు మహేశుని మల్లేశం మాట్లాడుతూ చొప్పదండి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు ఉన్నత భవిష్యత్తును అందించే విధంగా ఉపాధ్యాయులు కృషి చేస్తున్నారని, మండలంలోని పాఠశాలలకు అవసరమైన వాటి కొరకు చొప్పదండి లయన్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ తన వంతు సహకారం అందిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెక్రటరీ మామిడి రాజేష్ పవార్, కోశాధికారి తొడుపునూరి సత్యనారాయణ, పాఠశాల ప్రధానోపాధ్యాయులు రాజిరెడ్డి, లయన్స్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ లయన్ పెద్ది లక్ష్మికాంతం, డిస్ట్రిక్ట్ కో ఆర్డినేటర్లు వల్లాల క్రిష్ణహరి, కొల్లూరి ఆనందం, చింతల రవి, లయన్ సభ్యులు తొడుపునూరి లక్ష్మయ్య, సిరిపురం రాజు, తాటిపెల్లి శివకుమార్, బొల్లం సాంబమూర్తి మరియు ఉపాధ్యాయులు, పాఠశాల విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
