హుకుంపేట (అల్లూరి జిల్లా): త్రినేత్రం న్యూస్ జూలై 20: హుకుంపేట మండలం బొడ్డాపుట్టు వద్ద ద్విచక్ర వాహనం చోరీకి యత్నించిన ఇద్దరు దొంగలను హుకుంపేట ఎస్సై సూర్యనారాయణ చాకచక్యంగా పట్టుకున్నారు. తాడిపుట్టు గ్రామానికి చెందిన సుబ్బారావు తన స్కూటీని రోడ్డుపక్కన ఉంచి పొలాల్లో పనిచేస్తుండగా, దొంగలు వాహనం అపహరించేందుకు ప్రయత్నించారు. స్థానికులు వెంటనే హుకుంపేట పోలీసులకు సమాచారం అందించగా, ఎస్సై సూర్యనారాయణ వెంటనే స్పందించి పోలీస్ బృందాలను రంగంలోకి దింపి గంటల వ్యవధిలో దొంగలను పట్టుకున్నారు.
దొరికిన వారు గాజువాకకు చెందినవారని పోలీసులు తెలిపారు. వారి వద్ద మరో ద్విచక్ర వాహనం కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇటీవల చోటుచేసుకుంటున్న వాహన చోరీల నేపథ్యంలో, మరిన్ని కేసుల్లో వీరికి సంబంధం ఉందా అన్న దానిపై దర్యాప్తు కొనసాగుతోంది. సమయస్పూర్తితో దొంగలను అరెస్ట్ చేసిన ఎస్సై సూర్యనారాయణ, పోలీస్ సిబ్బందిని ప్రజలు అభినందిస్తున్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App


