
శ్రీపల్లికొండేశ్వర స్వామి ఆలయంలోకి రేపు ఊరేగింపుగా తీసుకురానున్న తిరువాసగం
……………………………………………………………………………….తిరుపతి జిల్లా సత్యవేడు నియోజవర్గం నాగలాపురం మండలం సురుటుపల్లి శ్రీపల్లికొండేశ్వరస్వామి ఆలయంలో డిసెంబర్ 10వ తేదీన( రేపు) ఆదివారం తిరువాసగంను ఊరేగింపుగా తీసుకురానున్నారు.ఆదివారం ఉదయం పది గంటలకు శివ భక్తులు( శివనడియర్) తిరువాసగం( జ్ఞానపీఠం, విద్యాపీఠం) పుస్తకమును శిరస్సుపై ఉంచుకొని తమిళనాడు ఉత్తుకోట శ్రీ చిరునీలకంఠేశ్వర స్వామి ఆలయం నుంచి మంగళ వాయిద్యాలు మధ్య వేలాదిమంది శివ భక్తులు నడుమ శ్రీపల్లి కోటేశ్వర స్వామి ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకురానున్నారు.చెన్నై అంబత్తూరు చెందిన అడియార్ బృందం దాదాపు 200 మంది శివ భక్తులు తిరువాసగమును ఊరేగింపుగా తీసుకు రావడం జరుగుతుంది.తదనంతరం ఆలయంలోని నటరాజస్వామి సన్నిధి నందు తిరువాసగమును ఉంచనున్నారు.ముఖ్యంగా శివతత్వాన్ని నలు దిశల వ్యాపింప చేయడంలో భాగంగా తిరువాసగమును ప్రతిష్ట గావించనున్నారు.9వ శతాబ్దపు శైవభక్తి కవి మాణిక్కవాసగర్ స్వరపరిచిన తమిళ శ్లోకాల సంపుటి ఇది. పైగా 51 కూర్పులను కలిగి ఉంది.తమిళ శైవ సిద్ధాంతం యొక్క పవిత్ర సంకలనమైన తిరుమురై యొక్క ఎనిమిదవ సంపుటిని కలిగి ఉంది.మాణిక్కవాసగర్ కథనం చేసినప్పుడు తమిళ వ్యక్తి వేషంలో శివుడు సంతకం చేసిన వ్రాసిన ఏకైక రచన తిరువాసగంగా చెప్పవచ్చు.
కానీ తాళపత్ర వ్రాతప్రతి భగవంతుని సంతకంతో తాళం వేసిన తిల్లై నటరాజ గర్భగుడి లోపల కనిపించింది.ఇంతటి ప్రఖ్యాత కలిగిన తిరువాసగం డిసెంబర్ 11వ తేదీన సోమవారం సురుటుపల్లి ఆలయంలో ప్రతిష్ట చేయ నున్నట్టు ఈ సందర్భంగా ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ ఏవీఎం బాలాజీ రెడ్డి చెప్పారు.భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.
