దేశమంతా 76…యానాంలో మాత్రం 71వ గణతంత్ర వేడుక
Trinethram News : దేశమంతా ఆదివారం 76వ గణతంత్ర దినోత్సవం జరగనుంది. కేంద్ర పాలితప్రాంతం యానాంలో మాత్రం 71వ గణతంత్ర దినోత్సవం కావడం గమనార్హం. దేశానికి 1947లో స్వాతంత్య్రం వస్తే ఫ్రెంచి ప్రభుత్వం పాలనలో ఉన్న యానాం, మిగిలిన మూడు ప్రాంతాలకు 1954 నవంబరు 1న విమోచనం లభించింది. అప్పటి ఫ్రెంచి కమిషనర్ ఎస్కరుయిల్ ఫ్రెంచి పాలిత ప్రాంతాలైన పుదుచ్చేరి, కారైకాల్, మాహే, యానాంలకు తగిన ప్రాధాన్యం, రక్షణ కల్పించాలని ప్రధాని నెహ్రూతో ఒడంబడిక చేసుకుని భారతదేశం నుంచి వైదొలిగారు. 1956లో ఈ తాత్కాలిక ఒప్పందం జరిగింది. తర్వాత యానంను కేంద్రపాలిత ప్రాంతంగా మార్చారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App