The State Election Commission announced the final list of panchayat voters
Trinethram News : గ్రామ పంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం కసరత్తు వేగవంతం చేసింది. ఇందు కోసం తాజాగా పంచాయతీల ఓటర్ల తుదిజాబితాను రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.
రాష్ట్రంలోని 12,867 గ్రామ పంచాయతీల్లో 1,13,722 వార్డులు ఉండగా వాటిల్లో 1,67,33,584 మంది ఓటర్లు ఉన్నట్లు పేర్కొంది. పంచాయతీ ఓటర్లలో 82,04,518 మంది పురుషులు ఉండగా మహిళా ఓటర్లు 85,28,573 మంది, ఇతరులు 493 మంది ఓటర్లు ఉన్నట్లు స్పష్టం చేసింది. అత్యధికంగా నల్గొండ జిల్లాలో 10,42,545 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 64,397 మంది ఓటర్లు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App