TRINETHRAM NEWS

అనేక ఋషిలచే పూజింపబడినది ఈ ఆలయం

Trinethram News : నగరి : నగరి కీళ్ళపట్టు గ్రామం అరుల్మీగు త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవాలయం మహాశివరాత్రి మహోత్సవ ఆహ్వానం…చిత్తూరు జిల్లా నగరి నియోజకవర్గం నగరి మున్సిపాలిటీ కీళ్ళపట్టు గ్రామంలో వెలసివున్న అరుల్మీగు త్రిపుర సుందరి సమేత చంద్రమౌళీశ్వర దేవాలయం ఈ దేవాలయం కొన్ని వందల సంవత్సరాలకు ముందు అష్ఠలక్ష్మీతో పూజించబడిన అష్టనాగ దేవతలు మరియు అనేక ఋషిలచే పూజింపబడినది ఈ ఆలయం , ఈ ఆలయం పూర్వికమైన ఆలయం నందు వేప ,బిల్వ ,మరియు మఱ్ఱి చేట్టు కొన్ని సంవత్సరములుగా వెలసివున్నది.ఈ ఆలయం ప్రక్కన కోనేరు లో నాగతీర్థం ,ఐశర్య తీర్థం వెలసివున్నది.

సర్పదోషములు నివారించు దేవాలయం ,సకల ఐశర్యములు కలుగుచేయు ఆలయముగా వెలసివున్నదని పూర్వీకులు తెలుపుతున్నారు.సిద్దగురువులచే పూజించిన ఆలయం ,కంచి మహా పెరియార్ కోనేరు నందు స్నానం చేసి అభిషేకం చేసుకున్న స్థలం.ప్రతి సంవత్సరం మహా శివరాత్రి రోజున ఒక్కొక్క అలంకరణ చేయడం జరిగింది.ఈ సంవత్సరం 26పిబ్రవరి25 రోజు మహాశివరాత్రి సందర్భంగా నీలకంఠ చరిత్ర అనేక దేవతలు ,రాక్షసులు రుద్రాక్ష లతో అలంకరించబడిన సర్పం వాసుకి రూపంలో చేయబడింది.

నీలకంఠ చరిత్ర గురించి తెలుసుకుందాం దేవతలు అమృతం పొందడానికి క్షీరసాగర మథనం జరుపుతారు క్షీరసాగర మథనానికి పూనుకోవడానికి కారణం రాక్షసుల బాధ పడలేక దేవతలు శివుని, బ్రహ్మను వెంట బెట్టుకొని శ్రీ మహావిష్ణువు వద్దకు వెళ్ళి వారి క్లేశాలు చెప్పుకొంటారు. అప్పుడు మహావిష్ణువు వారి మొర ఆలకించి “ఇప్పుడు రాక్షసులు బలంగా ఉన్న కారణం చేత వారితో సఖ్యంగా ఉండండి. వారితో సఖ్యంగా ఉండి క్షీరసాగర మథనం(పాల సముద్రం చిలకండి) జరపండి” అని చెబుతాడు.

“ఆ మథనానికి కవ్వంగా మందరగిరి ని వాడండి. త్రాడు గా వాసుకి ని వినియోగించండి. ఆ మథన సమయం లో అమృతం పుడుతుంది. దానిని మీరు ఆరగించి, క్లేశాలు వారికి మిగల్చండి” అని విష్ణువు సెలవిస్తాడు.ఆమాటలు విని, దేవతలు ఆనందించి వారివారి గృహాలకు వెళ్ళిపోతారు. కొంతమంది రాక్షసులు దేవతా సంహారానికి ముందుకువస్తుంటే బలి చక్రవర్తి వారిని వారిస్తాడు. ఆ తరువాత అలా కాలం వెళ్లబుచ్చుతున్న సమయంలో ఒకరోజు ఇంద్రుడు రాక్షసులకు క్షీరసాగర మథనం జరిపితే అమృతం పుడుతుందని, అమృతం సేవిస్తే మృత్యువు దరి చేరదని చెబుతాడు. దీనితో ప్రేరితులైన రాక్షసులు క్షీరసాగర మథనానికి ముందుకు వస్తారు.

క్షీరసాగర మథనం ప్రారంభించడంమందరగిరిని త్రవ్వి తీసుకొని రాగా అది మహాభారమైనదై క్రింద పడబోతే శ్రీ మహా విష్ణువు గరుడారూఢుడై వచ్చి, మందరగిరిని క్షీర సాగరములో వదిలాడు. వాసుకిని ప్రార్థించి వాసుకికి అమృతంలో భాగమిస్తామని చెప్పి, ఒప్పించి దాని రజ్జుగా చేసి పాలసముద్రాన్ని చిలకడం ప్రారంభించారు. ఆలా చిలకడం ప్రారంభించేటప్పుడు దేవతలు వాసుకి పడగ వైపు నడిచారు. దానితో రాక్షసులు కోపించి తోక వైపు నిలబడి చిలికే నీచులమా అని అనగా దేవతలు తోక పట్టుకొని చిలకడానికి అంగీకరించారు. ఆ విధంగా చిలుకుతుండగా ఆ మంధరగిరి క్రిందనిలిచే ఆధారము లేక క్షీరసాగరము లోనికి జారిపోతుండగా శ్రీ మహావిష్ణువు కూర్మావతారము ఎత్తి, ఆ పర్వతాన్ని తన వీపు మీద ఉంచుకొన్నాడు. మంధరగిరితో మథనం జరుపుతుండగా విపరీతమైన రొద వచ్చింది.

ఆరొదకు ఎన్నో జీవరాశులు మరణించాయి.హాలాహలం పుట్టడం- శివుడు ఆ మహావిషాన్ని సేవించడం* క్షీరసాగరమధనం దృశ్యం..అలా చిలుకుతుండగా ముందు హాలాహలం పుట్టింది. ఆ హాలాహలం సర్వాన్ని నాశనం చేస్తుంటే దేవదానవులకు తోచక బ్రహ్మ వద్దకు వెళ్తారు. బ్రహ్మ విష్ణువు వద్దకు అక్కడ నుండి కైలాసంలో ఉన్న శివుడి వద్దకు వెళ్ళి, క్షీరసాగర మథనం జరుపుతుండగా వచ్చినదానిని అగ్రతాంబూలంగా స్వీకరించుమని ప్రార్థించగా శివుడు హాలాహలం అని గ్రహించి పార్వతితో సేవించమంటావా అని అడుగగా సకల సృష్టిని రక్షించడానికి సేవించమని చెబుతుంది. అప్పుడు శివుడు ఆ గరళాన్ని తీసుకొని తన కంఠంలో ఉంచుకొన్నాడు. గరళాన్ని కంఠంలో ఉంచుకోవడం వల్ల గరళకంఠుడు అయ్యాడు. కాని, గరళం శివునిలో విపరీతమైన వేడిని, తాపాన్ని పుట్టించడం ప్రారంభించింది.

దానిని తట్టుకోవదం కోసం నిత్యం నెత్తి పైన నీళ్లు అభిషేకించుకుంటూ ఉండడమే మందు. అక్కడికీ తాపం అణగడానికి క్షీరసాగర మథనం లోనుంచి పుట్టిన చంద్రుడిని శివుడు తలపైన పెట్టుకొన్నాడు; గంగమ్మతల్లిని నెత్తిపైన ఉంచుకొన్నాడు. అయినా తాపం ఇబ్బంది పెడుతోనే ఉంటుందిట శివుడిని. కనుకనే, భక్తులు శివలింగానికి నిత్యం ఉదకాభిషేకం చేస్తూ ఉంటారు.26పిబ్రవరి25 మహాశివరాత్రి రోజు ఆరుకాల పూజ ,ఉమమహేశ్వర కళ్యాణోత్సవం వైభవంగా జరుగును.ఉదయం నుండి సాయంత్రం వరకు అన్నదానం జరుగును.కావున భక్తులందరూ విచ్చేసి స్వామి వారిని దర్శించి స్వామి వారి అనుగ్రహము పొందాలని ఆలయ అర్చకులు , గ్రామ ప్రజలు కోరారు..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Keellapattu Chandramouliswara Temple