దాత నామాల పురుషోత్తం సేవలు అమోఘం

TRINETHRAM NEWS

ఏడిదలో నేడు ఆధునిక పార్కు ప్రారంభం…

మండపేట మండలం ఏడిద కు చెందిన దాత నామాల పురుషోత్తం అనంతలక్ష్మి కుమారి దంపతుల సేవలు అమోఘమని పలువురు కొనియాడారు. మండపేట మండలం ఏడిదలోని చెరువును అభివృద్ధిపరిచి చుట్టూ వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేశారు. పార్కును ఆధునికరించారు. అందంగా తీర్చిదిద్దారు. దీనిని సోమవారం సాయంత్రం రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు, బిజెపి సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ దగ్గుపాటి వెంకటేశ్వరరావులు ప్రారంభించనున్నారు. పుట్టిన గ్రామానికి రుణం తీర్చుకోవాలని కోట్ల రూపాయలు నిధులతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి నామాల పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. ఏడిద గ్రామంలో ఆయన జన్మించారు. అక్కడే చదివిన ఆయనకు తెలంగాణలో వ్యాపారాలు ఆరంభించారు.

అక్కడ పోరస్ ఫార్మా ఇండస్ట్రీ స్థాపించి అనేకమందికి ఉపాధి చూపారు. హైదరాబాదులో స్థిరపడ్డ పురుషోత్తం లో ఏడిద లో ఏ చిన్న సమస్య వచ్చినా ముందుకు వచ్చి పరిష్కారం చూపుతున్నారు. గ్రామంలో ఐదు కోట్లతో పార్కు సొంత నిధులతో నిర్మించారు. ఏడిదలో జడ్పీ ఉన్నత పాఠశాల ఇంటర్ ప్లస్ భవనాన్ని 2.5 కోట్లతో నిర్మించారు. కళాశాలకు ల్యాబ్, గ్రామంలో కచేరి చావిడి, కంటి ఆసుపత్రి, 90 లక్షలతో గ్రంథాలయానికి మూడు అంతస్తుల భవనం నిర్మించారు. ఉన్నత పాఠశాల మార్గం రూ 20 లక్షలతో సిసి రహదారిగా రూపొందించారు. పది, ఇంటర్ తరగతులలో ప్రతిభ చూపిన విద్యార్థులకు భారీ నగదు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. ఉద్యానవనం నడకదారులను సోమవారం సాయంత్రం ప్రారంభోత్సవం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు,మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభిస్తారు.

చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని పెద్దలు నడవడానికి అనువుగా ఏడిద జడ్పి ఉన్నత పాఠశాల ఎదురుగా ఉన్న చెరువు చుట్టూ ఐదు కోట్లు సొంత నిధులతో పార్కు వాకింగ్ ట్రాకు నిర్మించారు. ఆట వస్తువులు ఏర్పాటు చేశారు. పార్కు చెరువు మధ్యలో స్వామి వివేకానంద విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా నామాల పురుషోత్తం మాట్లాడుతూ పుట్టిన ఊరుకు ఎంత చేసినా తక్కువేనన్నారు. గ్రామాభివృద్ధికి విద్య వైద్యానికి ఏ సహాయం అందించడం సిద్ధంగా ఉన్నానన్నారు. గ్రామస్తులు నామాల సేవల పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రామ అభివృద్ధి కమిటీ చేసిన సేవలను ఈ సందర్భంగా గ్రామస్థులు అభినందించారు. రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి కోసం అందరు ఏకం కావడం విశేషం.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

services of Data Namala Purushottam

You cannot copy content of this page

Scroll to Top