
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్, ( కొయ్యూరు ) జిల్లా ఇంచార్జ్ : అల్లూరిజిల్లా, కొయ్యూరు మండలంలోని, పలకజీడీ గ్రామంలో కురిసిన గాలివానకు పలకజీడి బాలికల ఆశ్రమ పాఠశాలలో ఐరన్ రేకుల షెడ్డు పూర్తిగా శిధిలమైంది. ఈదురు గాలులకు మొత్తం ఇనుప రాడ్స్ అన్ని విరిగిపోయి పైకప్పు మొత్తం లేచిపోయిందని, హాస్టల్ వార్డెన్ రాజేశ్వరి తెలిపారు. ఆ సమయంలో విద్యార్థులకు స్టడీ జరుగుతుందని, వార్డెన్ తో పాటు ఇరవై మంది విద్యార్ధినులు అక్కడ ఉన్నారని,
ఒక్కసారిగా ఇలా జరగడంతో చీకట్లో అందరూ వేరే బిల్డింగ్ లో కి పరుగులు తీశామని, ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదని, వార్డెన్ తెలియజేశారు.ఈ విషయాన్ని ATWO దృష్టికి తీసుకువెళ్తామని, వార్డెన్ అన్నారు. అలాగే పలకజీడి లో తరచూ విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగడంతో త్రాగునీరు లేక బాలికలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, అధికారులు తప్పని సరిగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
