
ఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు.
డిండి(గుండ్లపల్లి) ఏప్రిల్4 త్రినేత్రం న్యూస్. డిండిమండల కేంద్రంలో నేడు అనగా శుక్రవారం రోజు ఎంపీడీవో కార్యాలయం ముందు గ్రామపంచాయతీ ఏఐయుటిసి ఆధ్వర్యంలో కార్మికులు ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఇట్టి ధర్నాను ఉద్దేశించి జిల్లా సహాయ కార్యదర్శి నూనె వెంకటేశ్వర్లు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రామపంచాయతీలో పనిచేసిన కార్మికులకు ఎన్నికల హామీలను అమలు చేసి కనీస వేతనం ఇవ్వాలని గ్రీన్ ఛానల్ ద్వారా నేరుగా బ్యాంక్ అకౌంట్ లోనే కార్మికుల పెండింగ్ వేతనాలు వెంటనే జమ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
డిండి మండలంలోని. గ్రామపంచాయతీలలో వేతనాలు మూడు నెలల నుండి పది నెలల వరకు పెండింగ్ వేతనాలు ఉన్నాయని కార్మికులు జీతాలు నెలనెలా తరబడి రాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, గ్రామపంచాయతీ కార్యదర్శులు అధికారులు కార్మికులపై కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని నేరుగా బ్యాంకు ఖాతాలో వాళ్ళ జీతాలు ప్రతినెలా జమ చేయాలని మల్టీపర్పస్ విధానాన్ని రద్దుచేసి ఉద్యోగ బాధ్యత కల్పించాలని పిఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా అమలు చేయాలని అర్హత కలిగిన కార్మికులను పర్మినెంట్ చేసి వారి సమస్యలు పరిష్కరించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతరం పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రం మండల ప్రజాపరిషత్ కార్యాలయాలపు సీనియర్ అసిస్టెంట్ శివానందం కు ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ మండల అధ్యక్షులు బుషిపాక లింగమయ్య, గ్రామపంచాయతీ కార్మిక సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు రమావత్ జవహర్,లాల్, లాభాను, దావీదు, బుచ్చయ్య, లక్ష్మయ్య, పర్వతాలు, లింగమ్మ, శాంతి నాయక్, అంజయ్య, వెంకటయ్య, పరమేష్, భారతి, సుజాత, వాల్యా, వెంకటమ్మ, సుక్య, అంజయ్య, బిక్షమయ్య, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
