TRINETHRAM NEWS

మచిలీపట్నం

వైసిపి ప్రభుత్వం తెచ్చిన భూహక్కుల చట్టం – 2023 వలన ప్రజల ఆస్తులకు రక్షణ ఉండదు.*

ఈ చట్టం వలన భూవివాదాల పై సివిల్ కోర్టుకు వెళ్లే అధికారం ఉండదు.

భూవివాదాల పరిష్కారాల బాధ్యత రెవిన్యూ యంత్రాంగం చేతిలో పెట్టడం వలన ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ

*భూహక్కుల చట్టం 2023 ను వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేస్తూ మచిలీపట్నం న్యాయవాదుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ప్రధాన గేటు ముందు న్యాయవాదులు సంఘం అధ్యక్షుడు, తుంగల హరిబాబు, ప్రధాన కార్యదర్శి, కొట్టే రఘురాం, న్యాయవాదుల సంఘం మాజీ అధ్యక్షులు, లంకి శెట్టి బాలాజీ, పుప్పాల ప్రసాద్, న్యాయవాదులు, బూరగడ్డ అశోక్ కుమార్, కేజే భాగ్యరాజ్, జీవీఎల్ నరసింహారావు, కూనపు రెడ్డి శ్రీనివాస్, న్యాయవాదుల గుమస్తాల సంఘం ప్రధాన కార్యదర్శి, పి. వి. ఫణి కుమార్, జెవి నాగరాజు, టీవీ రామాంజనేయులు తదితరులు రిలే నిరాహార దీక్షలో పాల్గొనగా, వారికి మద్దతుగా, ప్రముఖ వైద్యులు, డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు, గొర్రెపాటి గోపీచంద్, తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్లు, చిత్తజల్లు నాగరాము, డి సుధాకర్, దేవరపల్లి అనిత, వాలిశెట్టి తిరుమలరావు, మిరియాల రామకృష్ణ లతోపాటుగా పలువురు పట్టణ ప్రముఖులు న్యాయవాదుల రిలే నిరాహార దీక్షకు సంఘీభావం తెలిపి పలువురు పట్టణ ప్రముఖులు, పలువురు న్యాయవాదులు, కార్పొరేటర్లు మాట్లాడుతూ….

*రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూహక్కుల చట్టం -2023 ను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరుతూ రాష్ట్రంలోని పలువురు న్యాయవాదులు రిలే నిరాహారదీక్షల శిబిరాన్ని రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో నిర్వహిస్తున్నారు అన్నారు.

భూమి కి సంబంధించిన సివిల్ వివాదాలను ఇప్పటివరకు సివిల్ కోర్టులు విచారించి, తీర్పులు చెప్పేవి.అయితే భూ సంభందిత కేసులు సివిల్ కోర్టులల్లో ఎక్కువ కాలం పెండింగ్ లో ఉంటున్నాయనే కారణంగా, వీటి సత్వర పరిష్కారం కోసం అని రాష్ట్ర ప్రభుత్వం భూహక్కుల చట్టం 2023 ను తీసుకొచ్చింది.*

ఈ చట్టం లోపభూయిష్టంగా ఉంది.ఈ చట్టం వలన అస్తి రక్షణ హక్కు సామాన్యుడి నుండి తీసివేశారు.

ఈ చట్టం ప్రకారం భూవివాదాల పై సివిల్ కోర్టులకు వెళ్లే అధికారం ఉండదు.

భూవివాదాల పై సివిల్ కోర్టులకు బదులు,రాష్ట్ర ప్రభుత్వంచే నియమించబడ్డ టైటిల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్ (TRO)కు దరఖాస్తు చేసుకోవాలి.వారు ఇచ్చే ఆదేశాలు నచ్చక పోతే లాండ్ టైటలింగ్ అప్పిలెట్ అధికారికి ఆపిల్ చేసుకోవలసి ఉంటుంది. ఈ

చట్టం ద్వారా భూ ఇతర ఆస్తుల హక్కులను, న్యాయ వ్యవస్థ పరిధి నుండి తప్పించి అధికారుల పరిధిలోకి తెచ్చారు. భూ వివాదాల పరిష్కారం బాధ్యత రెవిన్యూ యంత్రాంగ చేతిలో పెట్టడం వలన ప్రజలకు మేలు కంటే కీడే ఎక్కువ

ఈ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తుంది.కావున అధికార పార్టీ నాయకులు రాజకీయ వత్తిల్ల కు తల వోగ్గి అర్హులకు అన్యాయం చేసే అవకాశం ఉంది

ఈ చట్టాన్ని అడ్డుపెట్టుకొని అధికార పార్టీ నాయకులు తమకు ఇష్టంలేని వారిని ఇబ్బందిపెట్టే అవకాశం ఉంది.ఈ చట్టం వలన ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోతుంది.

*కావున ప్రభుత్వం వెంటనే ఈ చట్టాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ,ఈ చట్టానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేస్తున్న రాష్ట్రంలోని న్యాయవాదులకు పలువురు పట్టణ ప్రముఖులు, టిడిపి కార్పొరేటర్లు సంపూర్ణ మద్దతు తెలియచేస్తున్నాము అన్నారు.

సాయంత్రం ప్రముఖ సీనియర్ న్యాయవాది, కొల్లిపర వెంకట రమణమూర్తి దీక్షలో కూర్చున్న న్యాయవాదులకు, న్యాయవాద గుమస్తాలకు నిమ్మరసం ఇచ్చి రిలే నిరాహార దీక్షను ఉపసంహరించారు.