జూన్ 27, 2026

WhatsApp Image 2023 12 22 at 4.19.57 PM

TRINETHRAM NEWS

నారా లోకేష్ ను కాపు సామాజిక వర్గం వారు అత్యధిక మెజార్టీతో గెలిపించాలి

మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ

నారా లోకేష్ ను మంగళగిరి ఎమ్మెల్యేగా అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఇందుకు కాపు సామాజిక వర్గం వారు విశేషమైన కృషి చేయాలని మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నాయకులు కన్నా లక్ష్మీనారాయణ పిలుపు నిచ్చారు. శుక్రవారం కాజ జాతీయ రహదారి వెంబడి ఓ ప్రైవేట్ కార్యక్రమానికి విచ్చేసిన ఆయనను కాపు దళం నాయకులు కలిశారు. ఈ సందర్భంగా కన్నా మాట్లాడుతూ, జనసేన మద్దతుతో బరిలోకి దిగనున్న నారా లోకేష్ కు కాపు సామాజిక వర్గమంతా అండగా నిలవాలని అన్నారు. కాపు దళం నాయకులందరూ గ్రామాల్లో పర్యటించి ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో కాపు దళం నాయకులు టిడిపి మంగళగిరి పట్టణ ఉపాధ్యక్షుడు గోవాడ దుర్గారావు, విన్నకోట శ్రీనివాసరావు, మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ సుంకర రఘుపతిరావు, పల్నాటి నాగేశ్వరరావు, కంకణాల శివ, అమరావతి జేఏసీ నాయకులు ఆకుల ఉమామహేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page