భర్త వేధింపులు తాళ లేక భార్య బలవన్మరణం.
ప్రేమించి అనుమానించటం తో బలవన్మరణం.
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
ప్రేమించి అనుమానించటం తో పాటు అదనంగా ₹5 లక్షలు కావాలని భర్త వేధించటం తో వివాహిత బలవన్మరణానికి పాల్పడిన ఘటన శనివారం తెల్లవారుజామున ఖని భాపూజీనగర్ లో జరిగింది గోదావరిఖని వన్ టౌన్ ఎస్ ఐ.ఎల్.భూమేష్ కథనం ప్రకారం నగరం లో ని భాపూజీ నగర్ కు చెందిన కాకనాడ కుమారస్వామి సెప్టెంబర్ 10 ,2024 నా అదే కాలనీ కి చెందిన మాడుగుల లలిత (18) ను ప్రేమించి వివాహం. వేసుకున్నాడు.పెళ్లి అయిన నాటి నుంచి ఎలాంటి పని చేయకుండా నిత్యం మద్యం సేవిస్తూ జులాయిగా తిరుగుతూ పలు కేసుల్లో జైల్ కు వెళ్లి వచ్చాడు.ఐతే నిత్యం భార్య మమత ను కుమారస్వామి మట్టెలు,పుస్తెలతాడు తో పాటు అదనంగా ₹5 లక్షలు కట్నం కావాలని వేధించేవాడు.దీంతో మమత శ్రీరాంపూర్ లోనివాసం ఉండే తన తల్లి తండ్రులైన మాడుగుల మీనరావు ,శారద వద్దకు ఈ నెల 26 వెళ్లగా వాళ్లు సర్ది చెప్పి పంపించగా గోదావరిఖనికి వచ్చింది.
తిరిగి ఈ నెల 27 న మళ్లీ గొడవ జరిగింది.ఈ క్రమం లో భార్య భర్తలు అదే కాలనీ కి చెందిన చిలుముల శివ రిసెప్షన్లో వెళ్లి రాత్రి ఒంటి గంటకు వచ్చారు.అదే సమయం లో కుమారస్వామి ఇంటిముందు ఇరువురికి గొడవలు జరిగాయి .అక్కడ ఉన్నవారు కుమారస్వామి కిటికీ లోంచి చూడగా మమత ఉరివేసుకొని కనిపించింది.స్ధానికం ఉన్నవారు తలుపు తట్టగా కుమారస్వామి తలుపు తీశాడు .అప్పటికే నైలాన్ తాడు తో మమత పై కప్పుకు ఉరి వేసుకొని మృతి చెందింది. శారీరక ,మానసిక వేధింపుల తో మమత మృతికి కారణమైన కుమారస్వామి పై చట్టరీత్యా చర్య తీసుకోవాలని మృతురాలి తల్లి మాడుగుల శారద పిర్యాదు మేరకు 80 బి ఎన్ ఎస్ ప్రకారం కేసు నమోదు చేసి ఏ సి పి మడత రమేశ్ సీఐ ఇంద్రసేన రెడ్డి ఆదేశాల మేరకు విచారణ చేపట్టాం .
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App