జూలై 7, 2026

WhatsApp Image 2024 03 06 at 21.06.42

TRINETHRAM NEWS

Trinethram News : హైద‌రాబాద్ :మార్చి 06
ప‌విత్ర రంజాన్ మాసం మార్చి 12వ తేదీ నుంచి ప్రారంభం కానుంది.

ఈ నేప‌థ్యంలో అన్ని ప్ర‌భు త్వ శాఖ‌ల్లో ప‌ని చేస్తున్న రెగ్యుల‌ర్ ఉద్యోగుల‌తో పాటు కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు గంట ముందే ఇంటికి వెళ్లేలా వెసులు బాటు క‌ల్పిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మార్చి 12 నుంచి ఏప్రిల్ 14వ తేదీ వ‌ర‌కు ముస్లిం ఉద్యోగులు సాయంత్రం 4 గంట‌ల‌కే త‌మ విధులు ముగించుకుని ఇంటికి వెళ్లొచ్చ‌ని ఉత్త‌ర్వుల్లో పేర్కొన్నారు.

నెలవంక దర్శనం మరుసటి రోజు నుంచి ఉపవాస దీక్షలు ప్రారంభం కానున్నా యి.ఇస్లాంలో రంజాన్ మాసానికి అత్యంత ప్రాధాన్యత ఉంది. దివ్య గ్రంథమైన పవిత్ర ఖురాన్ ఈ మాసంలోనే దివి నుంచి భువిపైకి అవతరించింది.

దీనికి ప్రతీక‌గా ఈ మాసంలో ఉపవాసాలను ఆచరిస్తారు. రంజాన్ మాసంలో సూర్యోద యానికి ముందు ముస్లింలు ఉపవాస దీక్షను ప్రారంభించి ప్రార్థనల్లో పాల్గొంటారు. సాయంత్రం సూర్యాస్తమ యం అనంతరం ఉపవాస దీక్షను విరమిస్తారు…

You cannot copy content of this page