TRINETHRAM NEWS

అమరావతిలో భూమిలేని పేదలకు అందజేస్తున్న పెన్షన్ పెంపు

రూ.2500 నుంచి రూ.5 వేలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకూ నిధుల విడుదల

రాజధాని అమరావతిలో భూమిలేని పేదలకు సీఎం జగన్ మోహన్ రెడ్డి సారధ్యంలోని ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. ప్రతి నెలా అందజేస్తున్న పింఛన్‌ను రూ.2,500 నుంచి రూ.5 వేలకు పెంచింది. పింఛన్లతో పాటు ఉచిత విద్య, వైద్య వసతుల కల్పనకు రూ.21.98 కోట్లు విడుదల చేసింది. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం జీవో విడుదల చేసింది. నిధులను విడుదల చేస్తున్నట్టు పురపాలకశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వై.శ్రీలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు.