WhatsApp Image 2024 02 28 at 19.30.32
ఈ సభకు ఆ పార్టీ అధినేత చంద్రబాబు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు.
ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ సభ టీడీపీ, జనసేన గెలుపు సభ ఇది అని వ్యాఖ్యానించారు.
అలాగే రాష్ట్రంలో జరుగుతున్న అరాచకపాలనపైనా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
వైసీపీ దొంగలపై పోరాటం చేయాలని టీడీపీ, జనసేన నాయకులు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
రాష్ట్ర భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన కలయిక అని చంద్రబాబు చెప్పారు.
ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం తాను, పవన్ చేతులు కలిపినట్లు స్పష్టం చేశారు.
అహంకారంతో రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించారని మండిపడ్డారు. వైసీపీ విముక్తి కోసమే టీడీపీ, జనసేన పొత్తు అని తెలిపారు.
ఇది జనం కలిపిన పొత్తు అని, రాష్ట్రంలో వెలుగులు నింపబోతోందని వ్యాఖ్యానించారు.
రాబోయే ఎన్నికలు రాష్ట్రానికి కీలకమని తెలిపారు. త్వరలో రాష్ట్రానికి నవోదయం రాబోతోందని చెప్పారు..
