TRINETHRAM NEWS

Trinethram News : కరీంనగర్ – శంకరపట్నం మండలం తాడికల్ శివారులో పూర్తిస్థాయి భూ పరిహారం అందలేదంటూ NH-563 నిర్మాణ పనులకు అడ్డుపడి ఆందోళనకు దిగిన రైతు

ఇప్పలపల్లి గ్రామ రైతు వెంగళ శ్రీనివాస్‌కు చెందిన సర్వే నంబర్ 166లో రహదారి నిర్మాణం కింద 23 గుంటల భూమి కోల్పోయాడు. పరిహారం కింద గుంటకు రూ.36 వేల చొప్పున రైతు బ్యాంకు ఖాతాలో జమ చేశారు.. అయితే అదే సర్వే నంబర్లోని ఆరుగురు రైతులకు గుంటకు రూ.56 వేలతో పరిహారం అందించారు

దీంతో న్యాయం చేయాలని పలుమార్లు అధికారులకు విన్నవించినప్పటికీ చెల్లించకపోవడంతో పలుమార్లు రోడ్డు పనులను రైతు అడ్డుకున్నాడు

గురువారం సైతం నిర్మాణ పనులు అడ్డుకొని ఆందోళనకు దిగడంతో తహసీల్దార్ భాస్కర్ స్థానిక పోలీసుల సాయంతో అక్కడికి చేరుకున్నాడు.. దీంతో తహసీల్దార్ కాళ్లపై పడి మిగతా పరిహారం ఇప్పించాలని వేడుకున్నాడు

వెంటనే పోలీసు సిబ్బంది శ్రీనివాస్‌ను పోలీస్ స్టేషన్‌కు తరలించారు…..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App